రొమాంటిక్ సీన్ అప్పుడు మోహన్ బాబు అలా చేశారన్న సీనియర్ నటి !
నటి జయలక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. డాన్సర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా ఎదిగారు. మొదట్లో యాంకర్ గా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో ఓ సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నోరువిప్పింది.
మోహన్ బాబు డైరెక్టర్ దాసరి నారాయణ రావుని గురువుగా భావిస్తారు. అలా దాసరి భార్య పద్మతో కూడా జయలక్ష్మికి మంచి అనుబంధం ఉంది. ఒకసారి వాళ్లింటికి వెళ్ళినపుడు ఆమె.. మోహన్ బాబుకి పరిచయం చేశారన్నారు. తెలిసిన అమ్మాయని సినిమాలో ఏదైనా అవకాశం ఇవ్వమని కూడా చెప్పారన్నారు. ఆవిడ అడిగారనే మోహన్ బాబు ఒక సినిమాలో కలెక్టర్ భార్య పాత్ర కోసం అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాలో కలెక్టర్ భార్య మోహన్ బాబు ముందు పైట జార్చి సర్దుకునే సీన్ ఉందని.. అందుకు తాను ఇబ్బంది పడ్డానని వెల్లడించారు.

ఇక ఆ విషయాన్ని డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లతో అదే విషయం చెప్పినట్టు జయలక్ష్మి స్పష్టం చేశారు. అయితే కొంత షూటింగ్ పూర్తి అయ్యిందని ఇపుడు ఇలా చేస్తే ఎలా అంటూ కోప్పడ్డారన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు కోప్పడతారని కూడా చెప్పారట. అప్పుడే ఆ విషయం గమించిన మోహన్ బాబు ఏమిటి సమస్య అని అడిగితే.. ఆ సన్నివేశం నేను చేయలేనంటూ చెప్పారన్నారు. అందుకు మోహన్ బాబు కూడా వేరే ఆర్టిస్ట్ ని రమ్మని ఆ సీన్ చేయించారని వివరించారు.
మోహన్ బాబు ఏమి అనకుండా, కోప్పడకుండా మౌనంగా పంపించడం మీకే జరిగినట్లుందని అందరూ చెప్పారన్నారు. తన ఇబ్బందిని అర్ధం చేసుకొని వేరే నటితో సీన్ చేయించినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలని అన్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా తాను అలాంటి పాత్రలు చేయలేదని చెప్పుకొచ్చారు.

-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications