దర్శకులకు అమ్మాయిల సప్లై..గుట్టురట్టు చేసిన నటి
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది. ఇక ఈ రోజుల్లో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఎఫైర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా.
తాజాగా ఓ నటిపై సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. నటి వైజాగ్ జగదీశ్వరి చేసింది తక్కువ సినిమాలే అయిన నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. వైజాగ్ జగదీశ్వరిపై ఇటీవల ఓ రూమర్ తెర మీదకు వచ్చింది. ఆమె దర్శకులకు అమ్మాయిలను సరఫరా చేసి సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తుందని ఆరోపణలు వినిపించాయి. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. వైజాగ్ జగదీశ్వరి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టారు. దర్శకులకు అమ్మాయిలను సప్లై చేయడం అనేది అవాస్తమని ఆమె తెలిపారు.

నాపై కావాలనే కొందరు ఇలాంటి ఆరోపణలు చేశారని వైజాగ్ జగదీశ్వరి చెప్పారు. నేను బోరబండలో ఉంటానని.. పెద్దగా చదువుకోలేదని ..దీంతో సినిమా సెట్స్‌కు వెళ్లడానికి రూట్స్ నాకు తెలిసిన వారిని వెంటపెట్టుకుని వెళ్లేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది. అంతే తప్పిస్తే తాను ఎటువంటి తప్పు చేయలేదని..నాపై కావాలనే నిందలు వేశారని ఆమె వాపోయారు. నా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆమె తెలిపారు. పేదరికం నుంచి తాను వచ్చానని..తనకు అలాంటి పనులు చేయడం చేతకాదని వైజాగ్ జగదీశ్వరి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications