అల్లు అర్జున్, రామ్‌చరణ్.. అవే తగ్గించుకుంటే మంచిది: షారుక్‌ఖాన్

బాలీవుడ్ బాద్ షా దుబాయ్ లో గ్లోబల్ విలేజ్ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ భారతదేశంలోని సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ తదితరుల గురించి మాట్లాడారు. వీరంతా తనకు మంచి స్నేహితులని, ఎంతో క్లోజ్ గా ఉంటారన్నారు. దక్షిణ భారతదేశంలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి షారుక్ మాట్లాడారు. రజనీకాంత్ సార్, కమల్ హాసన్ సార్ అంటూ సీనియర్లపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. వారిపై షారుక్ చూపించిన గౌరవానికి అభిమానులంతా ఫిదా అవుతున్నారు.

వారందరికీ తాను ఒకటే చెబుతున్నా
తనకు దక్షిణ భారతదేశంలో ఎంతోమంది స్నేహితులున్నారన్నారు. తాను అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నానని, వారంతా చాలా వేగంగా డ్యాన్సులు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని కోరారు. వారు అంత వేగంగా డ్యాన్సులు చేస్తుంటే తాను చేయలేకపోతున్నానన్నారు. ప్రధానంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది హీరోలపై షారుక్ తనదైన శైలిలో అభిమానాన్ని కురిపించారు. దీంతో ఆయా అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమకు షారుక్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరలవుతోంది.

Shah Rukh Khan says all South indian superstars are his very good friends

వీరంతా మంచి డ్యాన్సర్లు కాదా?
తెలుగు సినీ రంగంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో వేగంగా డ్యాన్సు చేస్తారు. తారక్ పేరు ప్రస్తావించలేదని అతని అభిమానులు మండిపడుతున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును కూడా షారుక్ ప్రస్తావించలేదు. వీరిద్దరూ స్టార్లు కాదని మీ ఉద్దేశమా అంటూ సామాజిక మాధ్యమాల్లో తారక్ అభిమానులు, పవన్ అభిమానులు ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. యష్, మహేష్ బాబు, ప్రభాస్ మంచి డ్యాన్సర్లా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల హీరోల అభిమానుల మధ్య విభేదాలు వస్తాయని, మాట్లాడేటప్పుడు అందరినీ గుర్తుంచుకొని మాట్లాడాలని, లేదంటే పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. దాదాపుగా దక్షిణాది హీరోలందరితో షారుక్ ఖాన్ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+