'ఆంటీ' కాదు.. యూత్‌ ఐకాన్! 47 ఏళ్ల వయసులోనూ ఆ అందం అదుర్స్!!

47 ఏళ్ల వయసులో కూడా తన అందంతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇటీవల ఆమె తన సరికొత్త లుక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. మరి ఆ అందాల నటి ఎవరో కాదు.. మమళ్ల శైలజ ప్రియ. నటి మమళ్ల శైలజ ప్రియ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో 100కు పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇటీవల శైలజ ప్రియ తన కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 47ఏళ్ల వయస్సులో కూడా ఆమె చాలా అందంగా, ఫిట్‌గా కనిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియ కొత్త లుక్
తాజాగా ప్రియ తన కొత్త లుక్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. స్టైలిష్ హెయిర్ స్టైల్, అద్భుతమైన డ్రెస్సింగ్‌తో ఆమె యంగ్ బ్యూటీలా కనిపిస్తున్నారు. ఆమె ఫిట్‌నెస్, అందాన్ని చూసి నెటిజన్లు ఆమె అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది అదే ప్రియ ఆంటీనా?", "వయసు తగ్గిపోతోందా?", "ఈ లుక్ కోసం ఎంత కష్టపడి ఉంటారు?" వంటి కామెంట్లు చేస్తున్నారు.

Shailaja Priya Shines at 47 Not an Aunty But a Youth Icon

శైలజ ప్రియ సినీ ప్రస్థానం
ప్రియ 1997లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. "మాస్టర్", "దొంగాట", "గోకులంలో సీత" వంటి చిత్రాలతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆమె హీరోయిన్‌గా, సహాయ నటిగా, కొన్ని సినిమాలలో విలన్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు ఆమె అనేక తెలుగు సీరియల్స్‌లో నటించి ఇంటింటికీ సుపరిచితులయ్యారు. ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటీకీ బాగా గుర్తుండిపోయాయి.

బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులారిటీ
ప్రియ సీరియల్స్, సినిమాలకే పరిమితం కాలేదు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్' సీజన్-5లో కూడా పాల్గొన్నారు. 'బిగ్‌బాస్' ఇంట్లో ఆమె తన నిజమైన స్వభావం, వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. 'బిగ్‌బాస్' తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ లభించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, కొత్త ప్రాజెక్టులను పంచుకుంటున్నారు.

47 ఏళ్ల వయసులో ప్రియ తన అందం, ఫిట్ నెస్ కారణంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె కొత్త లుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. ఆమె తరచుగా తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అభిమానులు ఆమె అందాన్ని చూసి లైకులు, కామెంట్లు చేయడం సహజమే. చాలా మంది 'ఆ అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు..' అంటూ కామెంట్ల వర్షం కురిపించడం కూడా కామన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+