'అర్జున్ రెడ్డి' హీరోయిన్ గుర్తుపట్టారా..? ఇలా అయిపోయిందేంటి..?

సినీ ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎంతోమంది నటీనటులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడుతుంటారు. ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఆఫర్ రావాలంటే మాత్రం కూసింత అదృష్టం కూడా ఉండాలంటారు. అలా తొలి సినిమాతోనే బూరెల బుట్టలో పడింది హీరోయిన్ షాలినీ పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రీతిగా ఆమె నటన చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. తొలి సినిమాకే అంత మంచి రోల్ దొరికింది షాలినీ పాండేకు. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కసిగా చేశారు విజయ్ దేవరకొండ, షాలినీ పాండే. ఇద్దరూ పోటీపడి చేశారు. అందుకే స్క్రీన్ పై వాళ్ల కెమిస్ట్రీ అంతలా వర్క్ అవుట్ అయింది. దాంతో మూవీ బ్లాక్ బస్టర్ అయింది.

అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్. అందరూ కొత్తవాళ్లే. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ లో ఈ మూవీని తీశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 50 కోట్లకు పైగా రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయారు. అయితే ఈ మూవీతో హీరోయిన్ షాలినీ పాండేకు సైతం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మహానటి చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ తో 118 చిత్రంలో నటించింది.

అయితే హీరోయిన్ గా తొలి మూవీతోనే తన సత్తా ఏంటో చాటిన షాలినీ పాండేకు ఆ తర్వాత అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందరికీ లైఫ్ ఇచ్చిన అర్జున్ రెడ్డి మూవీ మాత్రం షాలినీ పాండేకు మాత్రం చివరికి చేదు అనుభవమే మిగిల్చింది. అప్పుడు ఆ మూవీనే ఆమెకు గుర్తింపు తీసుకురాగా.. ఇప్పుడు ఆమెకు ఇతర క్యారెక్టర్స్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

Shalini Pandey s Rome Bikini Photos Take the Internet by Storm

అయితే కొన్ని రోజుల నుంచి సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉంటుంది ఈ భామ. తాజాగా ఆమె రోమ్ నగరానికి చేరుకుంది. ఆ నగరం మొత్తం బికినీతో తిరుగుతూ సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాల్లో తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అక్కడికి వెళ్లి తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+