Viral Video: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పై పబ్లిక్ లో అలా చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్..
టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ షాలినీ పాండే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ- షాలినీ పాండే కెమిస్ట్రీ స్క్రీన్ పై అద్దిరిపోయింది. అందుకే ఈ మూవీ ఈ జనరేషన్ లో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అటు విజయ్ కు ఇటు షాలినీ కు ఈ మూవీ ద్వారా మంచి పేరు, గుర్తింపుతోపాటు అవకాశాలు కూడా పెరిగాయి. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ్, హిందీలో పలు సినిమాల్లో నటించింది షాలినీ పాండే. గతేడాది తమిళ్ లో ధనుష్ నటించిన ఇడ్లీ కడాయ్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ ఏడాది హిందీలో రాహు కేతు అనే సినిమా చేసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది.

అయితే అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే తాజాగా ఓ సంఘటనతో మరోసారి వైరల్ గా మారింది. ముంబైలో ఇటీవల జరిగిన ది ఇండియా డిజైన్ ఐడీ ఈవెంట్ కు షాలినీ పాండే హాజరైంది. అదే వేడుకకు ఫిల్మ్ డైరెక్టర్ ఫరజ్ అరిఫ్ అన్సారీ కూడా హాజరయ్యాడు. అయితే షాలినీ పాండేను చూసిన దర్శకుడు ఫరజ్ వెళ్లి ఆమెను హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి మీడియాకు ఫొటోలు ఇచ్చారు. ఆ సమయంలో షాలినీ నడుము, భుజాలను నిమురుతూ దర్శకుడు కనిపించాడు.
అటు షాలినీ మాత్రం నవ్వుతూనే ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఫరాజ్ తీరుపై మండిపడుతున్నారు. కొందరు మాత్రం సెలబ్రిటీ లైఫ్, ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ దర్శకుడు షాలినీకు క్లోజ్ కావొచ్చు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ వీడియోపై సౌత్ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందించారు. "థ్యాంక్యూ ఫర్ ది డెమోన్ స్ట్రేషన్ మ్యాన్ ఇన్ గ్లాసెస్.. వూ ఎవర్ యూ ఆర్" అని ఆ వీడియోను షేర్ చేశారు.












Click it and Unblock the Notifications
