'గంగ' ఒక్కడే... ప్రాణాలు ఐదు.. ఒక్క పోస్టర్ తో శర్వానంద్ విధ్వంసం
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల మనమే, బైకర్, నారీనారీ నడుమ మురారి లాంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. బైకర్ మూవీ అయితే శర్వానంద్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 3 న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. బైకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ జోష్ లో ఇప్పుడు భోగీ అనే రూరల్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు.
భోగి సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రక్షా బంధన్ పోస్టర్ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పక్కా పల్లెటూరి యువకుడిగా శర్వానంద్ లుక్ ఆకట్టుకుంటోంది. చుట్టూ చెల్లెల్లతో తాటి ముంజలు తింటూ శర్వానంద్ లుక్ అద్దిరిపోయింది. ఈ మూవీలో ఆయనకు ఐదుగురు చెల్లెల్లు ఉన్నట్లు పోస్టర్ చూస్తుంటూనే అర్థం అవుతోంది. ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. భోగి మూవీలో గంగ అనే శక్తివంతమైన పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. ఈ సినిమా కథ 1960 నాటి కాలంలో సాగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా కనిపించనున్నారు.

ఇక ఇప్పటికే భోగి మూవీ క్లైమాక్స్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ భోగి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో చేయడానికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీకి తోడు కాలయానం అనే వైవిధ్యమైన అంశాన్ని జోడిస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications