ఎవరూ ఊహించని బ్రాండ్‌కు అంబాసీడర్‌గా శ్రీలీల
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు.
శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి'గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'రిబిన్ హుడ్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఈ భామ సత్తా చాటడానికి రెడీ అవుతోంది.

అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు.
ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీల పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించడానికి గ్నీన్ సిగ్నల్ ఇస్తోంది. శ్రీలీల శాస్త్రి బామ్ అనే బ్రాండ్ యాడ్ చేసింది. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఈ భామ నాట్యం చేస్తూ.. అటు ఇటు తిరుగుతూ తనతో నాట్యం చేస్తోన్న అమ్మాయికి పెయిన్ వస్తే బామ్ తెచ్చి ఇవ్వడం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు శ్రీలీల ఇలాంటి యాడ్స్ చేస్తుందని ఊహించలేదంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications