2024లో టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది. ఈ సమయంలో 2024లో చాలానే మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
ఇక ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడించింది. అలా చూసుకుంటే రష్మిక మందన్నా టాప్‌లో నిలిచింది. ఆ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది పుష్ప-2తో మరో బ్లాక్ బ్లాస్టర్‌ను కొట్టేసింది ఈ అమ్మడు. బాలీవుడ్‌లో కూడా అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.












Click it and Unblock the Notifications