కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయిన స్టార్ హీరోయిన్.. పెళ్లి చేసేసుకుందా?
టెలివిజన్, పంజాబీ సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ నటి షెహనాజ్ గిల్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తన ప్రవర్తనతో, ముక్కుసూటితనంతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానులను అలరించడంలో గానీ, వారిని అకస్మాత్తుగా ఆశ్చర్యపరచడంలో గానీ షహనాజ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న కొన్ని ఫోటోలు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాయి.
కొత్త పెళ్లికూతురిలా షెహనాజ్ గిల్.. ఫ్యాన్స్ షాక్!
షెహనాజ్ గిల్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో సాంప్రదాయ దుస్తులలో ఉన్న కొన్ని లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. డిజైనర్ సూట్, మెడలో అందమైన హారం, పెద్ద జుకాలు పెట్టుకుని, నుదుటిపై బిందీతో ఆమె అత్యంత అందంగా మెరిసిపోయింది. అయితే ఈ ఫోటోలలో అభిమానులను అసలు ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమిటంటే.. ఆమె పాపిట సింధూరం పెట్టుకుని కనిపించడం. పెళ్లి కాకుండానే షెహనాజ్ గిల్ ఇలా కొత్త పెళ్లికూతురిలా నవవధువు గెటప్‌లో మెరుస్తూ సింధూరాన్ని పెట్టుకోవడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది.

గుట్టుచప్పుడు కాకుండా పెళ్లా?
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందా అంటూ చాలా మంది ఆరా తీయడం మొదలుపెట్టారు. మరికొందరైతే పెళ్లి కాకుండానే సింధూరం ధరించే బాలీవుడ్ దిగ్గజ నటి రేఖతో ఆమెను పోలుస్తూ.. షెహనాజ్ 'రేఖ పార్ట్-2' గా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అసలు నువ్వు పెళ్లికూతురివి ఎలా అయ్యావు? ఎవరు నిన్ను పెళ్లాడారు?" అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ సింధూరం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి.. ఇది ఏదైనా సినిమా షూటింగ్‌కు సంబంధించినదా లేదా మరేదైనా కారణమా అనేది కేవలం షెహనాజ్ చెబితేనే పూర్తి స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications