కొంపముంచిన ముద్దు..15 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగిన తెలుగు స్టార్ హీరోయిన్

ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.

గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటి తరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. ఓ హీరోయిన్ ముద్దు పుణ్యమా అంటూ ఏకంగా 15 ఏళ్లు కోర్టు తిరిగిందనే విషయం చాలామందికి తెలియదు. ఆ హీరోయిన్ మరెవరో కాదు..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే...పొడుగు కాళ్ల సుందరిగా శిల్పాశెట్టికు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది.తెలుగులో సాగర కన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారామె. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీ సినిమాలకు మాత్రమే శిల్పా శెట్టి పరిమితం అయింది. 48 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెరగని అందంతో అభిమానులను అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Shilpa Shetty Richard Gere kiss controversy

అయితే ఈ బ్యూటీ ముద్దు పెట్టించుకున్నందుకు ఏకంగా 15 ఏళ్లు కోర్టు చూట్టు తిరిగింది. శిల్పా శెట్టి ముద్దు వివాదం 2007లో చోటుచేసుకుంది. ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది భారతదేశంలో తీవ్ర దుమారం రేపింది. కొందరు దీనిని భారతీయ సంస్కృతికి విరుద్ధంగా భావించి నిరసనలు తెలిపారు. శిల్పా శెట్టిపై కేసు కూడా నమోదైంది. అయితే, చాలా సంవత్సరాల తర్వాత ఆ కేసు కొట్టివేయబడింది.

ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది కేవలం స్నేహపూర్వకమైన చర్య అని సమర్థించారు. మరికొందరు మాత్రం బహిరంగ ప్రదేశంలో అలా చేయడం అభ్యంతరకరమని వాదించారు. ఈ సంఘటన భారతదేశంలో సాంస్కృతిక విలువలు మరియు బహిరంగ ప్రవర్తనపై చర్చకు దారితీసింది.2007లో ముంబైలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది.

2017లో సుప్రీంకోర్టు ఈ కేసును రాజస్థాన్ నుండి ముంబైకి బదిలీ చేసింది.శిల్పాశెట్టి ఈ కేసు నుండి తనను విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె తనను రిచర్డ్ గేర్ చర్యలకు "బాధితురాలి"గా పేర్కొన్నారు.జనవరి 2022లో ముంబైలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శిల్పాశెట్టిని ఈ కేసు నుండి విడుదల చేసింది. ఆమెపై మోపబడిన ఆరోపణలు నిరాధారమైనవని కోర్టు పేర్కొంది.ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 2023లో కొట్టివేసింది. శిల్పాశెట్టిని నిందితురాలిగా పరిగణించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఒక మహిళను బహిరంగ ప్రదేశంలో తాకినా లేదా ముద్దు పెట్టుకున్నా ఆమెను నేరస్తురాలిగా చూడలేమని కోర్టు పేర్కొంది.

శిల్పాశెట్టి స్పందన
శిల్పాశెట్టి ఈ సంఘటనను "పెద్ద విషయం కాదు" అని కొట్టిపారేశారు. తాను ఎటువంటి అవమానానికి గురికాలేదని ఆమె సమర్థించుకున్నారు.

రిచర్డ్ గేర్ స్పందన
రిచర్డ్ గేర్ తన చర్యలు అపార్థం చేసుకోబడ్డాయని,భారతీయ సాంస్కృతిక విలువలను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని క్షమాపణలు చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తి చెందదని తెలియజేయడానికి మాత్రమే తాను అలా చేశానని ఆయన అన్నారు.ఈ వివాదం భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి, సాంస్కృతిక విలువలు , హాలీవుడ్ ప్రముఖుల చర్యలపై భిన్నాభిప్రాయాలను వెలుగులోకి తెచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శిల్పాశెట్టికి ఈ కేసు నుండి విముక్తి లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+