నేనే అమ్మాయినైతే కమల్ హాసన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంటా - స్టార్ హీరో

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయకపోయినా డబ్బింగ్‌, రీమేక్‌ చిత్రాలతో ఆయన ఇక్కడ మంచి గుర్తింపు పొందారు. రజినీకాంత్ జైలర్ సినిమాలో ఆయన ఏ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ '45' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో దీన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

రీసెంట్ గానే చెన్నైలోని పీవీఆర్ సత్యం థియేటర్‌లో ఈ చిత్ర తమిళ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్రతో పాటు దర్శకుడు అర్జున్ జాన్య, నిర్మాత రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.

shiva-rajkumar-shocking-comments-on-kamal-haasan

ఆయన మాట్లాడుతూ.. చెన్నై తన జీవితానికి చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు. తాను ఇక్కడే పుట్టాను, పెరిగాను, చదివాను అని తెలిపారు. తనకొచ్చిన మొదటి అవకాశం ఇక్కడి నుంచే అని.. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఈ నగరంతో ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ హీరో కావాలని కోరుకోలేదని, తనకు హీరో అంటే కమలహాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లే అని, వాళ్లే తన ఫేవరెట్స్ అని చెప్పారు.

ముఖ్యంగా కమలహాసన్ గురించి మాట్లాడుతూ, "ఆయనంటే నాకు ఎంత ఇష్టం అంటే, నేను అమ్మాయినైతే ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకునేవాడిని" అని హాస్యంగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నటుడిగా ఎన్నో విజయాలు, అపజయాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. కానీ వాటిని ఎప్పుడూ తలకెక్కించుకోలేదని.. జీవితంలో పెద్ద సవాళ్లూ ఎదురయ్యాయని వాపోయారు. తల సర్జరీ, క్యాన్సర్ వంటి అనుభవాలనూ దాటి వచ్చానని చెప్పారు. ఇప్పుడు తిరిగి కెమెరా ముందు నిలబడగలగడం ఆనందంగా ఉందని అన్నారు.

ఇక 45 సినిమాను వినూత్న కథాంశంతో వస్తుందని.. ఇది కేవలం కమర్షియల్ మూవీ కాదని.. భావోద్వేగాలు, యాక్షన్, సందేశంతో కూడిన సమగ్ర చిత్రమని శివరాజ్ కుమార్ తెలిపారు. కథ విన్న వెంటనే నటించాల్సిందేనని ఫీలయ్యానని చెప్పుకొచ్చారు. మరోవైపు శివరాజ్ - ఉపేంద్ర కాంబినేషన్‌ లో సినిమా అంటే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఉపేంద్ర డైరెక్షన్ లో శివరాజ్ కుమార్ నటించిన ఓం కల్ట్ మూవీగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+