ఇది కదా అసలైన ఫ్యానిజం అంటే..: ట్రాఫిక్ సైతం బంద్
Shiva Rajkumar: శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం భైరతి రణగల్. నియో- నాయర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమ సత్తాను మరోసారి చాటి చెప్పింది.
నర్తన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని సెంటర్ల నుంచీ పాజిటివ్ టాక్ లభిస్తోంది. రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగిబాబు, దేవరాజ్, ఛాయా సింగ్ ఇతర కీలక పాత్రలను పోషించారు.

గీతా పిక్చర్స్ బ్యానర్ కింద తెరకెక్కిందీ మూవీ. ఇది శివ రాజ్‌కుమార్ హోమ్ ప్రొడక్షన్. ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. బస్రూర్ సంగీతాన్ని అందించారు. 2017లో శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మఫ్తీ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఇదే.
భైరతి రణగల్ విడుదల సందర్భంగా బెంగళూరులోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తెల్లవారు జాము నుంచే థియేటర్ల వద్ద బారులు తీరి నిల్చున్నారు అభిమానులు. భారీ కటౌట్లను నెలకొల్పారు. శివన్న కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. నిలువెత్తు పూలదండలతో ముంచెత్తారు.
ప్రీమియర్ షో ముగిసిన తరువాత ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చారు. ప్రధాన రహదారులపై సైతం శివ రాజ్‌కుమార్ అభిమానుల కోలాహలం కనిపించింది.
ರಣಗಲ್ ಆರ್ಭಟಕ್ಕೆ KG Road ಬ್ಲಾಕ್ 🔥🔥#RanagalCelebrations #BhairatiRanagal #KingShivanna 👑 pic.twitter.com/o6IcvreYWc
— taleharate4 (@taleharate4) November 15, 2024
కెంపెగౌడ్ బస్‌స్టేషన్‌కు దారి తీసే రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపి మరీ బాణాసంచా కాల్చారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేశారు. అభిమానుల కోలాహలం ముగిసేంత వరకూ వాహనాలు కదల్లేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications