నాగార్జున నయా అవతార్.. 'శివ' 4k రీ- రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారంటీ..
అక్కినేని నాగార్జున ఐకానిక్ మూవీ శివ .. రీ- రిలీజ్ కు సిద్ధమైంది. నవంబర్ 14 న ఈ మూవీ గ్రాండ్ రీ- రిలీజ్ కానుంది.అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. అది కూడా 4k డాల్బీ అట్మాస్ వర్షన్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. తాజాగా శివ 4K ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . రీ- రిలీజ్ ట్రైలర్ ఫ్యాన్స్ తోపాటు సెలబ్రిటీస్ ను కూడా ఆకట్టుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
టాలీవుడ్ కు సినిమా మేకింగ్ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేసిన సినిమా శివ. 1989 లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నాగార్జునకు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా శివ. అయితే ఈ మూవీని నవంబర్ 14 న రీ- రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే శివ మూవీ అప్పటి ప్రింట్ కాకుండా.. 4k డాల్బీ అట్మాస్ వర్షన్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. తాజాగా శివ 4K ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.." 36 ఏళ్ల తర్వాత నేను.. నాగార్జున కలిసి స్టేజీని పంచుకోవడం ఆనందంగా ఉంది. శివ 4K రీ- రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. నాకు కొత్తగా ఆలోచించే అవకాశం ఇచ్చిన నాగార్జునకు కృతజ్ఞతలు. ప్రస్తుత సాంకేతికతను ఉపయోగించి ఈ చిత్రాన్ని రీ మాస్టరింగ్ చేశాం. డాల్బీ ఆట్మాస్ మిక్సింగ్ తో పాటు ఏఐ ఇంజినీరింగ్ ను వినియోగించాం. శివ మూవీ రీ మాస్టర్డ్ వెర్షన్ చాలా ఫ్రెష్ గా.. షార్ప్ గా ఉంది. నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయినా.. డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చింది.. మాత్రం నాగార్జున.." అని రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. 36 ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ తీసిన శివ చిత్రంతో నేను బిగ్ స్టార్ అయ్యాను. శివ మూవీ 4K వర్షన్ చాలా అద్భుతంగా వచ్చింది. గత 6 నెలలుగా ఈ మూవీ రీ మాస్టరింగ్ కోసం ఆర్జీవీ తీవ్రంగా శ్రమించారు. ఈ మూవీ డాల్బీ అట్మాస్ సౌండ్స్ తో రానుంది. శివ 4K వర్షన్ అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. శివ మూవీ నవంబర్ 14 న రీ- రిలీజ్ అవుతుంది. ఒరిజినల్ గా ఈ మూవీ అక్టోబర్ 5 న రిలీజ్ అయింది. న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది. మా నాన్న గారి మొదటి సినిమా మే 22న రిలీజ్ అయింది. నా మొదటి సినిమా కూడా మే 22 నే రిలీజ్ అయింది.. అని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications