రూ. 2400 కోట్ల భారీ కుంభకోణం: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు!
ప్రముఖ నటి సన్నీ లియోన్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కర్ణాటకలో వెలుగు చూసిన రూ.2,400 కోట్ల శివమ్ అసోసియేట్స్ ఙారీ పెట్టుబడి మోసానికి సంబంధించిన కేసులో సన్నీ లియోన్‌కు కర్ణాటక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 'శివమ్ అసోసియేట్స్' ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో భాగంగా మనీ లాండరింగ్ వ్యవహారాలపై విచారణ జరుపుతోన్న సీఐడీ.. బుధవారం నాడు సన్నీ లియోన్‌కు ఈ నోటీసులు పంపింది. అయితే ఈ కేసులో సన్నీ లియోన్ ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం ఆమెకు జరిగిన ఓ ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికే ఈ నోటీసు ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. అక్రమ చర్యలకు సంబంధించిన ఆరోపణలు లేవని.. ఆమెకు పంపిన నోటీసులు తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ అధికారులు స్పష్టం చేశారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. శివమ్ అసోసియేట్స్ ప్రమోటర్ శివానంద్ నీలన్నవర్ అనధికారిక డిపాజిట్ నెట్‌వర్క్‌లు, యాప్‌ల ద్వారా కర్ణాటక, మహారాష్ట్రల్లోని దాదాపు 40,700 మంది ఇన్వెస్టర్లకు ఏడాదికి 36 శాతం నుంచి 60 శాతం వరకు భారీ రిటర్న్స్ ఇస్తామని ఆశచూపి మోసం చేశాడు. కొత్త ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డబ్బుతో పాత వారికి రిటర్న్స్ ఇస్తూ స్కీమ్ నడిపాడు. ఇలా సేకరించిన ప్రజల సొమ్ముతో ఆయన 2023లో 'ఛాంపియన్' అనే కన్నడ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలోని 'డింగారా బిల్లి నాను' అనే ఐటెం సాంగ్‌లో సన్నీ లియోన్ డ్యాన్స్ చేయగా.. అందుకు గానూ ఆమెకు రూ. 1 కోటి రెమ్యునరేషన్ చెల్లించారు.

ఈ క్రమంలోనే నిందితుడు శివానంద్ నీలన్నవర్ చెల్లించిన ఆ రూ. 1 కోటి రూపాయలు ఇన్వెస్టర్ల నుంచి దోపిడీ చేసిన ఫండ్స్ నుంచే వచ్చాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సీఐడీ సన్నీ లియోన్ నుంచి సమాచారం సేకరించనుంది. ఈ ఐటెం సాంగ్ కోసం ఆమెకు ఫీజు ఏ రూపంలో అందిందనే వివరాలను అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. కాగా ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు శివానంద్‌ను పోలీసులు మే నెలలోనే అరెస్ట్ చేయగా.. అనంతరం కేసు సీఐడీకి బదిలీ అయింది. ఇప్పటికే నిందితుడికి చెందిన 30కి పైగా బ్యాంక్ ఖాతాలను సీఐడీ ఫ్రీజ్ చేయడంతో పాటు లగ్జరీ కార్లు, ఆస్తులను జప్తు చేసింది.
మరోవైపు నటి సన్నీ లియోన్ విషయానికి వస్తే.. ఆమె చివరగా జనవరి 2026లో విడుదలైన 'త్రిముఖ' అనే తెలుగు సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 98 కోట్ల నుంచి రూ. 115 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం రూ. 1 కోటి వరకు చార్జ్ చేసే సన్నీ.. సినిమాలతో పాటు పలు వ్యాపారాల్లోనూ రాణిస్తోంది. ఆమెకు 'స్టార్ స్ట్రక్' అనే కాస్మెటిక్స్ బ్రాండ్, 'అఫెట్టో' అనే పర్ఫ్యూమ్ బ్రాండ్‌తో పాటు నోయిడాలో 'చికా లోకా' అనే ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఆమె తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి 'సన్‌సిటీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే ప్రొడక్షన్ కంపెనీని కూడా నడుపుతోంది.












Click it and Unblock the Notifications