రాజమౌళి వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న - శ్రీనివాసరావు

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని... ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు చావు ఒక్కటే మార్గమని, ఇదే తన మరణ వాంగ్మూలం అంటూ పోలీసులకు ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఈ మేరకు ఆ లేఖలో, వీడియోలో ఏం చెప్పారంటే.. తనకు రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని.. రాజమౌళి డైరెక్టర్ గా ఎదగడానికి తన జీవితం మొత్తం ధార పోశానని చెప్పారు. ఆయన కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయానన్నారు. రాజమౌళి వల్లే నా జీవితం నాశనం అయ్యిందని.. ఇప్పుడు తనని టార్చర్ చేస్తున్నారని తెలిపారు. యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా టైటిల్స్ లో కూడా తన పేరు వేశారని గుర్తు చేశారు. కావాలంటే చెక్ చేసుకోండి అని పేర్కొన్నారు.

shocking comments on director Rajamouli by his friend srinivasarao

తాను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని.. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్‌ చెర్రీ ఇలా చాలామందితో కలిసి తాను పనిచేశానన్నారు. వారందరికీ కూడా రాజమౌళితో తన స్నేహం గురించి తెలుసని ప్రస్తావించారు. అంతే కాకుండా రాజమౌళికి క్షుద్ర పూజలు తెలుసని, అందుకే ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయని, ఆ విద్యతో ఎవరినైనా ఆయన లోబరచుకోగలరని పేర్కొన్నారు. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంతో కావాలనే ఆరోపణలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళిని కావాలనే టార్గెట్ చేసుకున్నారా అనే అనుమానాలు నెలకొన్నాయి.

రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నామని.. కానీ, ఒక మహిళ వల్ల వారి జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదన్నారు. అందరి జీవితాల్లో మాదిరే వారి లైఫ్‌లోకి ఒక అమ్మాయి ప్రవేశించిందని.. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత తనతో కూడా స్నేహం కుదిరిందన్నారు. ఆర్య2 సినిమా కథ మాదిరే తమ స్టోరీ ఉంటుందని.. మేము ముగ్గురం క్లోజ్‌ కాబట్టి ఏం చేద్దాం అంటూ రాజమౌళిని అడిగానని.. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే తనని కోరాడు అని చెప్పారు.

అందుకు తాను ఒప్పుకోలేదని.. ముగ్గురం కలిసే ఉందామని చెప్పానన్నారు. అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడని.. అప్పుడు ఆమెను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరానన్నారు. ఇదంతా జరిగింది శాంతినివాసం సీరియల్‌ సమయంలో అని చెప్పారు. రాజమౌళికి ఎప్పుడైతే స్టార్‌డమ్‌ వచ్చిందో అప్పటి నుంచి గొడవలు మొదలుపెట్టాడని.. తమ ట్రైయాంగిల్‌ స్టోరీని ఒక సినిమా తీస్తానని అన్నందుకు నరకం అంటే ఏంటో చూపించారని తెలిపారు.

ఒక ఫ్రెండ్‌ వల్ల తన జీవితం ఇలా అయిపోయిందని.. తాను చనిపోయిన తర్వాత అయినా రాజమౌళికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయాలని కోరారు. ఇవన్నీ తన మరణ వాగ్మూలంగా తీసుకోవాలని వెల్లడించారు. అయితే శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీని మీద రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+