జాగ్రత్తమ్మా.. అసలే రోజులు బాగాలేవు: ప్రభాస్ హీరోయిన్ కు బెదిరింపులు- ఎంతకైనా తెగిస్తాం

ఉత్తరప్రదేశ్ బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటాని నివాసం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు గానీ, ప్రాణాపాయం గానీ సంభవించలేదు. దిశాపటాని, సినిమా పరిశ్రమను హెచ్చరించడానికే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటుంది దిశా పటాని నివాసం. శుక్రవారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్‌లను అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఈ ఘటన పాల్పడింది. తానే కాల్పులు జరిపినట్లు ఈ గ్యాంగ్ మెంబర్ రోహిత్ వెల్లడించాడు. పలు రౌండ్లు కాల్పులు సంభవించాయి. రెండు రౌండ్లపాటు గాలిలో కాల్పులు జరిపారు.

Shooting Incident Near Disha Patani s Home Goldy Brar Gang Takes Responsibility

ఆ వెంటనే వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ అనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దిశ పటానీతో పాటు మొత్తం చలన చిత్ర పరిశ్రమకు ఇదొక హెచ్చరిక అని తెలిపారు. ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్య మహారాజ్ ను దిశా పటానీ అవమానించిందని, సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. దేవతలను అవమానించడాన్ని
ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇది ట్రైలర్ మాత్రమేజ.. అని ఆ పోస్ట్‌లో రాశారు.

దిశా పటానీ లేదా ఇంకెవరైనా సరే తమ మతం పట్ల అగౌరవం వ్యవహరించినా, కించపరిచేలా ప్రవర్తించినా, అవహేళనగా చూపించినా, వారి ఇంట్లో ఎవరూ సజీవంగా ఉండరు అని వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ హెచ్చరించారు. ఈ వార్నింగ్ ఒక్క దిశా పటానీకి మాత్రమే కాదని, మొత్తం సినీ పరిశ్రమలోని కళాకారులు, వారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుందని అన్నారు. భవిష్యత్తులో తమ మతాన్ని, సాధువులను అవమానించే చర్యలకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

తమ మతాన్ని రక్షించడానికి, ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని వీరంద్ర చరణ్ తేల్చి చెప్పాడు. తాము ఎప్పుడూ వెనుకడుగు వేయబోమని, తమకు మతం, సమాజం ఒకటేనని, వాటిని రక్షించడమే తమ మొదటి కర్తవ్యం అని ఆ సోషల్ మీడియా పోస్ట్ లో స్పష్టంగా తెలియజేశారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు నిర్ధారించారు. దిశా పటాని చెల్లెలు ఖుష్బూ పటాని కూడా ఈ విషయంపై వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+