చిరంజీవి కొడుకు, మేనళ్లుళ్లు, బావ కొడుకులే హీరోలవ్వాలా?
తెలుగు సినీ పరిశ్రమలో సుప్రీం హీరోగా కొనసాగుతున్న చిరంజీవి కాలక్రమంలో మెగాస్టార్ గా అవతరించారు. ఆ తర్వాత నుంచి తన ఆలోచనలను అమలు చేయడం ప్రారంభించారు. ముందుగా తన తమ్ముడు పవన కల్యాణ్ ను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తీసుకువచ్చారు. అతను నిలదొక్కుకున్న తర్వాత లైనులో నిలబడ్డ బావ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జన్ ను గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. నెమ్మది నెమ్మదిగా అల్లు అర్జున్ కూడా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత వంతు కొడుకు రామ్ చరణ్ ది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం చేశారు.
లడ్డూలు ఎక్కువగా తిన్నా బోరు కొడుతుంది
అంతే.. ఆ తర్వాత వరుసగా బళ్లన్నీ కదిలాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్, చిరు మేనళ్లుల్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మధ్యలో చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం సినిమాలు చేయడంలేదు. ఇంతమందిని చూసిన తర్వాత తెలుగు సినీ ప్రేక్షకులందరికీ విసుగెత్తింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కుటుంబ సభ్యులందరినీ పరిశ్రమలో నింపేశారు. లడ్డూలు ఒకటి తింటే రుచి, రెండు తిన్నా పర్వాలేదు. ఎక్కువగా తింటే ముఖం మొత్తుతుంది. ప్రస్తుతం చిరంజీవి కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది.

మెగా అంటేనే అందరికీ ముఖం మొత్తుతోంది
ఇంతమంది హీరోలను చూసిన తర్వాత మెగా కుటుంబం నుంచి సినిమా వస్తోందంటే అందరికీ ముఖం మొత్తుతోంది. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇటీవల కాలం నుంచి మెగా హీరోల సినిమాలు ఏవీ సరిగా ఆడలేదు. వీరితో సినిమాలు తీసిన నిర్మాతలంతా దారుణంగా నష్టపోయారు. అయితే పరిశ్రమలో తమదే ఆధిత్యం ఉండాలి.. ఏ టీవీ పెట్టినా మన సినిమాలే రావాలి.. మన పాటలే రావాలి.. మన గురించే మాట్లాడాంటూ ఇతరులను తొక్కేసే రాజకీయాలు చేస్తుంటే చివరికి తమను తామే తొక్కుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గమనంలో ఉంచుకోవడం ఉత్తమం. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులను దాటితే అనర్థాలు తప్పవనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.












Click it and Unblock the Notifications