ఈ హీరోయిన్ పాపులారిటీ ముందు మోదీ కూడా తేలిపోయారే..!
దేశంలో ప్రధాని మోదీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నేతగా మోదీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందిరా గాంధీ తర్వాత మూడుసార్లు దేశానికి ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా మోదీకి ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రధాని మోదీకి ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి మోదీని సైతం సోషల్ మీడియాలో వెనక్కి నెట్టింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు శ్రద్ధా కపూర్. అవును శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ కంటే ముందు ఉన్నారు.
శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 91.4 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.శ్రద్ధా కపూర్ దెబ్బకు మోదీ నాలుగో స్థానానికి పడిపోయారు. మూడో స్థానంలో శ్రద్ధా కపూర్ ఉండగా, 91.8 మిలియన్ల ఫాలోవర్లతో ప్రియాంక చోప్రా 2వ స్థానంలో ఉన్నారు. 271 మిలియన్ల ఫాలోవర్లతో విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.మోదీని వెనక్కి నెట్టి వీళ్లిద్దరి తర్వాత స్థానంలో శ్రద్ధా కపూర్ నిలిచారు. శ్రద్ధా కపూర్ తాజాగా నటించిన స్త్రీ 2 బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది.

హార్రర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నమోదు చేసింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. శ్రద్ధా కపూర్ దెబ్బకు ప్రభాస్ కల్కి రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికి బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. ఆషికి 2 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది.












Click it and Unblock the Notifications