ఐటం సాంగ్‌తో దుమ్మురేపుతున్న ఇండియన్ స్టార్ క్రికెటర్ చెల్లి.. ఫుల్ ట్రెండింగ్ !
ఓ వైపు అన్న మైదానంలో మెరుపులు మెరిపిస్తుంటే.. మరోవైపు చెల్లి సిల్వర్ స్క్రీన్ పై స్టెప్పులతో దుమ్మురేపుతోంది. దీంతో ఇన్నాళ్లు సోదరుడి పేరు మాత్రమే మారుమోగగా.. ఇప్పుడు సోదరి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ అన్నాచెల్లెళ్లు ఎవరు ? ఆ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం...
భారత క్రికెటర్లలో పలువురు స్టార్ ఆటగాళ్లు సినిమాల్లో కూడా తళుక్కున మెరిసి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మారుతున్న కాలానుగుణంగా అటు ప్లే గ్రౌండ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను మెప్పిస్తున్న వారు ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు స్టార్ క్రికెటర్ " శ్రేయాస్ అయ్యర్ ". భారత క్రికెట్ జట్టులో ముఖ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు ఈ యంగ్ ప్లేయర్.

అటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో, ఒత్తిడిలో సైతం అద్భుతమైన ప్రదర్శనలతో జట్టుకు ఎన్నో విజయాలు అందించి సర్వత్రా మెప్పు పొందాడు. ఇక సోషల్ మీడియా లోనూ తన సోదరితో కలిసి చేసే సరదా వీడియోలు, రీల్స్‌తో కూడా అభిమానులకు చేరువయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన సోదరి " శ్రేష్ట " బాలీవుడ్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌తో సంచలనం..
కొరియోగ్రాఫర్‌గా తన కెరీర్ ప్రారంభించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో అన్నయ్య శ్రేయస్‌తో కలిసి చేసిన ఫన్నీ డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ అన్నాచెల్లెళ్ల జోడీ సోషల్ మీడియాలో ఎంతో మందికి ఫేవరెట్‌గా మారిపోయింది. వీరిద్దరి వీడియోలు తరచుగా మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తాయి.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌తో సంచలనం సృష్టించింది.
రీసెంట్ గానే శ్రేష్ఠ "సర్కారీ బచ్చా" అనే బాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రుస్లాన్ ముంతాజ్‌తో కలిసి ఆమె చేసిన "అగ్రిమెంట్ కర్లే" అనే ఐటెమ్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఈ అమ్మడి పెర్ఫార్మెన్స్, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో ఈ వీడియోకు లక్షల్లో లైకులు, మిలియన్ల వ్యూస్ వచ్చాయి. శ్రేయాస్ కూడా ఈ వీడియోను తన అకౌంట్ లో షేర్ చేస్తూ చెల్లిని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇక ఇప్పుడు అభిమానులంతా శ్రేష్ఠ.. రానున్న రోజుల్లో మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుందా లేక సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? అని జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే దక్షిణాది సినిమాలపై తనకు ఆసక్తి ఉందని ఆమె చెప్పడంతో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications