లిప్ లాక్ సీన్ కట్.. ఎందుకంటూ తెలుగు నటి ఫైర్..!

శ్రేయా ధన్వంతరి.. అక్కినేని నాగ చైతన్య నటించిన "జోష్" సినిమాలో ముఖ్య పాత్ర పోషించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన 'స్నేహగీతం' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ చిత్రాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.

కాగా హిందీలో నటించిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' తో వెబ్ సిరీస్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఆమె పోషించిన జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్', సిరీస్ లో కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే దుల్కర్ సల్మాన్‌తో 'చుప్' లో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీలో బోల్డ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు ఉన్న నటీమణుల్లో ఒకరిగా శ్రేయా నిలుస్తోంది. అయితే ప్రస్తుతం పలు హిందీ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది.

shreya-dhanwantari-shocking-post-on-super-man-indian-version

లేటెస్ట్ గా డేవిడ్ కొరెన్స్‌వెట్, రెచెల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సూపర్‌మ్యాన్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇండియన్ వెర్షన్ సెన్సార్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో 33 సెకన్ల ముద్దు సన్నివేశాన్ని తొలగించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్‌స్టా స్టోరీలో ఫైర్..

ఈ సెన్సార్‌ కట్‌పై శ్రేయా ధన్వంతరి ఇన్‌స్టా స్టోరీలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 'సూపర్‌మ్యాన్‌'లో 33 సెకన్ల సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్‌ని తొలగించారు. ఇదేం చర్య? మనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని సెన్సార్‌ వాళ్లు కోరుకుంటారు. పైరసీలను ప్రోత్సహించవద్దని అడుగుతారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ల ఉద్దేశమేంటో నాకు ఏమాత్రం అర్థంకావడం లేదు" అని రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలతో థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారెందుకు? మా డబ్బు, సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడటానికి థియేటర్ ఉత్తమ మార్గం.. ప్రేక్షకులను చిన్న పిల్లల్లా భావించి.. థియేటర్ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారు అని ఆమె ఘాటుగా విమర్శించారు.

మరోవైపు సెన్సార్ టీమ్ అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. ఈ మార్పుల అనంతరం సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2.10 గంటల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+