రెడ్ డ్రెస్‌లో శ్రియ.. భర్తతో ఆ సీన్ చూసి ఫ్యాన్స్ షాక్!
దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి శ్రియా శరణ్ మరోసారి తన బోల్డ్, రొమాంటిక్ లుక్‌తో వార్తల్లో నిలిచారు. తన అందచందాలతో అభిమానులను అలరించే శ్రియ.. సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం శ్రియ తన ప్రతిష్టాత్మక చిత్రం 'దృశ్యం 3' సాధిస్తున్న ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో చిత్రబృందం ముంబైలో ఓ గ్రాండ్ సక్సె పార్టీని ఏర్పాటు చేసింది. ఈ సంబరాల్లో శ్రియ తన భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో కలిసి పాల్గొన్నారు.
ముంబైలో జరిగిన ఈ వేడుకకు శ్రియ తన భర్తతో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఆ సమయంలో అక్కడున్న మీడియా, పాపారాజీల దృష్టి పూర్తిగా వీరిపైనే పడింది. కెమెరాల ముందుకు వచ్చిన ఈ జంట పరస్పరం ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎరుపు రంగు షార్ట్ డ్రెస్‌లో అత్యంత గ్లామరస్‌గా కనిపించిన శ్రియ, భర్త ఆండ్రీతో కలిసి కెమెరాల ముందే ఎలాంటి సంకోచం లేకుండా లిప్ కిస్ ఇచ్చి అందరినీ మురిపించారు. వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రెడ్ కార్పెట్‌పై భర్తకు ముద్దు ఇచ్చిన అనంతరం, శ్రియ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చారు. సినిమా సాధించిన ఘన విజయం ఇచ్చిన ఆనందం శ్రియ ముఖంలో స్పష్టంగా కనిపించింది. కొందరు నెటిజన్లు పబ్లిక్‌గా ఇలా ప్రవర్తించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెజారిటీ అభిమానులు మాత్రం వీరి ప్రేమపూర్వక బంధాన్ని ప్రశంసిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ జంటగా నటించిన 'దృశ్యం 3' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశీయంగా ఈ సినిమా రూ.232 కోట్లకు పైగా వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు ఏకంగా రూ.366 కోట్లకు పైగా మార్కును దాటి సునామీ సృష్టిస్తోంది.
Shriya Saran & Husband Andrei Koscheev Attend ‘Drishyam: The Conclusion’ Success Party#ShriyaSaran #AndreiKoscheev #DrishyamTheConclusion #SuccessParty #Drishyam #Bollywood #CelebrityCouple #FilmSuccess #EntertainmentNews #SaasBahuAurBetiyaan #SBB #SBBXtra https://t.co/ZxWO25smto
— SBB-Aajtak (@ATSBB) October 7, 2026














Click it and Unblock the Notifications
