డేటింగ్ అని తీసుకువెళ్లి అలా చేసేవారు - శృతి హాసన్
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది.స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది.

శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సడన్‌గా బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. తాజాగా ఈ భామ డేటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరితోనైనా డేట్‌కు వెళ్లినప్పుడు బిల్లులు నేనే కట్టాల్సి వచ్చేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. నాతో వచ్చిన వారు నీ దగ్గర డబ్బు ఉందిగా కట్టేయ్ అన్నట్లు చూసేవారు. మొదట్లో ఎవరిని అడగకుండానే బిల్లులు కట్టేదాన్ని. ఎందుకంటే.. బిల్లు పే చెయ్యడం కూడా ఎదుటివ్యక్తులపై ప్రేమను చూపిస్తుంది.
అయితే.. కొన్నాళ్లకు ఇదే విషయం మనం అడిగితే.. నువ్వు ఇష్టపడే కట్టావు కదా అనేవారని అప్పుడు చాలా బాధేసిందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి డబ్బు విషయంలో క్లియర్‌గా ఉండాలని అర్థం చేసుకున్నానంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. చేసిన తప్పులను గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications