అతనితో ఎప్పుడైన మింగిల్ అయ్యావా..శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపింది. శ్రుతి హాసన్ ఎప్పుడు కూడా తన రిలేషన్‌ను దాచాలని ప్రయత్నించలేదు.

శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. కొన్నాళ్లుగా శాంతను-శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను తో ఉన్న ఫోటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసిందన్న టాక్ వినిపిస్తుంది.
తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ భామ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ వ్యక్తి 'మీరు సింగిలా లేక కమిటెడ్ నా?' అని అడిగాడు. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ చెబుతాను. నేను ప్రస్తుతం సింగిల్. మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం. నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీగా బ్రతికేస్తున్నాను' అని సమాధానం చెప్పింది. శృతి హాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications