శృతి హాసన్‌కు పిల్లలు పుట్టే అవకాశం లేదా..?

హీరోయిన్ శృతి హాసన్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. శృతి హాసన్ ఇటీవలే తన ప్రియుడు శాంతను హజారికకు బ్రేకప్ చెప్పింది. కారణాలు తెలియవు కానీ తాము విడిపోయామని ఈ జంట ప్రకటించారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని శృతి హాసన్‌ తెలిపారు.తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న శృతి హాసన్‌ తన ఆరోగ్యం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను కొద్ది కాలంగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తెలిపారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మరియు ఎండోమెట్రియోసిస్‌తో తాను బాధపడుతున్నట్లు శృతి హాసన్‌ వెల్లడించారు.

మొదటి పీరియడ్ నుంచే ఆ సమస్యతో పోరాడుతున్నాను. ఆ బాధను నేను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నాను. బ్యాడ్ పీరియడ్స్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయలతో చిత్రాలు చేస్తున్న డైరెక్టర్స్‌కు నాకు పీరియడ్ సమస్య ఉందని చెప్పి మరో రోజు షూట్ పెట్టుకోమని చెప్పలేక బాధ భరించి సినిమాలు చేశాను.త‌న‌కు ఉన్న స‌మ‌స్య వ‌ల్ల షూటింగుల్లోను ఇబ్బందులు తలెత్తాయ‌ని కానీ బాధ‌ను భ‌రిస్తూనే తాను షూటింగ్‌లకు వెళ్లేదాన్ని అని శృతి హాసన్ తెలిపారు.

Shruti Haasan is suffering from a rare disease

అయితే శృతి హాసన్‌కు ఉన్న వ్యాధిపై నిపుణులు స్పందిస్తూ..పీసీఓఎస్ ఉన్న మహిళలకు పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉండదంటున్నారు. దీంతో శృతి హాసన్‌కు పెళ్లైనప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే..2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. తాజాగా ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో సలార్-2తో పాటు , పలు చిత్రాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+