పెళ్లంటే బాయ్ ఫ్రెండ్స్‌కు మూడిందే.. శృతి హాసన్
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.

ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. కొన్నాళ్లుగా శాంతను-శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను తో ఉన్న ఫొటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసినట్టు అయింది.
ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్‌కు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. శృతి హాసన్ రిలేషన్‌లో పెళ్లి అనే మాటకు తావు లేదట. కొంతకాలం సహజీనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చదట. వద్దని చెబుతుందట. పెళ్లి కావాలని ఒత్తిడి చేస్తే వదిలేస్తుందట. ప్రియుడు శాంతనుకి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఇదేనని తెలుస్తోంది. అయితే ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. శృతి హాసన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..పెళ్లి అంటే నాకు భయం అని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి కారణంగానే శృతి హాసన్ తన లవర్స్‌కు బ్రేకప్ చెప్పి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే శృతి హాసన్ తన ప్రియులకు బ్రేకప్ చెబుతోంది












Click it and Unblock the Notifications