Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మందు కొడతా.. తప్పేంటీ... డ్రగ్స్ విషయంలో శృతి హాసన్ క్లారిటీ

సెలబ్రిటీలకు పబ్ కల్చర్ అనేది కామన్. అందులోనూ సినిమా స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ, నటులకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం పలుమార్లు రుజువైంది. దీనిపై మొదటిసారి నోరు విప్పారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న శృతి హాసన్‌కు డ్రింకింగ్, డ్రగ్స్ గురించి ప్రశ్నలు ఎదురైయ్యాయి.

ఊహించని ప్రశ్నలకు సూటీగానే డ్రింకింగ్ అలవాటు ఉందంటూ సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఒకప్పుడు డ్రింక్ చేసేదాన్ని అని..ఇప్పుడు మానేశానని చెప్పుకొచ్చింది. తాను ఎనిమిదేళ్ల క్రితమే డ్రింక్ చేయడం మానేశానని..తరచూ పార్టీలకు వెళ్లడం వల్ల మద్యపానం అలవాటు అయిందని..ఇది తీవ్రతరం అవుతుందని గ్రహించి డ్రింకింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపింది.

Shruti Haasan says Alcohol was a big thing in my life

అలాంటి ఫ్రెండ్స్‌‌కు సైతం దూరం పెట్టినట్టు చెప్పుకొచ్చింది. డ్రింక్ మానేయడంపై ఎలాంటి రిగ్రేట్ ఫీల్ కావడం లేదని పేర్కొంది.పైగా దీని వల్ల జీరో హ్యాంగ్ ఓవర్స్‌తో లైఫ్‌ను లీడ్ చేస్తున్నట్టు తెలిపింది. తాను ఎప్పుడూ డగ్స్ అలవాటు చేసుకోలేదని.. అదే విధంగా స్మోకింగ్ కూడా దూరంగా ఉన్నానని.. నాకు తెలిసి స్మోకింగ్ అనేది వరెస్ట్ థింగ్‌ అని శృతి చెప్పుకొచ్చింది.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే..2023లో ఆమె ఖాతాలో రెండు హిట్లు చేరాయి. బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. మరికొద్ది రోజుల్లో ప్రభాస్‌ నటించిన ''సలార్‌''తో శృతి హాసన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+