పచ్చిగా ఓపెన్ అయిన శృతి హాసన్.. హీరోయిన్స్ కొన్ని త్యాగాలు చేయాల్సిందే
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాప్‌లతో శృతి హాసన్ సతమతం అయింది. పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది.
స్టార్ హీరోయిన్‌గా సమయంలో వ్యక్తిగత జీవితంలో తీవ్ర సమస్యలను ఫేస్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.

ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. 2023లో శృతి హాసన్ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. సలార్‌తో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.
అయితే సలార్‌లో నటించడంపై శృతి హాసన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. సినిమాలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా విలువ ఉండదు. పైగా ఆమె సినిమాలో కనిపించేది కూడా తక్కువే. దీంతో ఇలాంటి సినిమాల్లో శృతి హాసన్ ఎందుకు నటించారని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. తనపై వస్తోన్న విమర్శలపై శృతి హాసన్ తాజాగా స్పందించారు. ఒక చిత్రం ఒప్పుకునేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. అలాగే సలార్‌లో నా పాత్ర తక్కువ సమయం ఉన్నప్పటికీ.. అది సినిమాలో కీలక పాత్ర. అందుకే ఆ సినిమా చేశాను.
నేను కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించాను. కానీ వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరికొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసినప్పటికీ పెద్ద హిట్టయ్యాయి. ఇవన్నీ కేవలం సినీ ఇండస్ట్రీలో ఓ భాగం మాత్రమే అని ఈ భామ తెలిపింది. హిట్ సినిమాల్లో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications