అవును.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా తప్పేంటీ..నా బాడీ నా ఇష్టం..!
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నేళ్ళ బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.కొద్ది రోజులకే ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది.రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది.

శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది.శాంతను హజారిక కూడా శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి.చిరంజీవితో కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన 'సలార్' కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో..శృతి హాసన్ కెరీర్ పరంగా బాగా కలిసి వచ్చింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా శృతి హాసన్ తన సర్జరీ గురించిన విషయాన్ని బయటపెట్టింది.హౌటర్‌ఫ్లై షో, ది మేల్ ఫెమినిస్ట్‌తో పాత ఇంటర్వ్యూలో శ్రుతి మాట్లాడుతూ.. తన ముక్కుకు జరిగిన సర్జరీ గురించి వివరించారు.నేను నా ముక్కును సరి చేసుకున్నాను. నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది.అంతకు ముందు నేను నా మొదటి సినిమా చేశాను. షూటింగ్ సమయంలో నా ముక్కుకు గాయమైంది. దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను.దీనిపై తాను ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇది నా శరీరం నా ఇష్టం. నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం. నేను అన్నీ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను" అంటూ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications