మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విడుదలై పరాజయం పాలైంది. మొదటిరోజు మొదటిఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మహేష్ బాబు అభిమానులు మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మండిపడ్డారు. ప్రిన్స్ తో సినిమా అనగానే నీకు అన్నీ ప్రయోగాలే గుర్తుకు వస్తాయా? కనీసం చెప్పుకోదగ్గ డైలాగులు కూడా లేవని, సినిమాలు చేయడం మాని పవన్ కల్యాణ్ సినిమాలకు కథలు, మాటలు రాస్తుంటే అవే చేసుకోవాలని, దర్శకత్వం చేయడం ఎందుకంటూ నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఓవర్సీస్ లో మంచి రికార్డులు నెలకొల్పిన మహేష్ బాబుకు గుంటూరు కారం అక్కడ కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. గుంటూరు కారం విదేశాల్లో 2.63 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీనికి పోటీగా విడుదలైన హనుమాన్ చిత్రం లాంగ్ రన్ లో 5.26 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ తాజా సంచలనం టిల్లు స్క్వేర్ చిత్రం ఓవర్సీస్ లో ఇప్పటికి 2.69 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకా ఎంతో వసూలుచేసే అవకాశం కనపడుతోంది.

siddu jonnalagadda movie tillu square beat guntur kaaram collections in overseas

సిద్ధు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డును అలవోకగా అధిగమించేశాడు. ప్రస్తుతం పరిశ్రమలో యంగ్ హీరోలు మంచి కథలు, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటివారిలో సిద్దు కూడా ఒకరు. లాంగ్ రన్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా మూడు నుంచి నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం కనపడుతోంది. మహేష్ బాబు రికార్డును బ్రేక్ చేసి ముందుకు సాగడం అనేది చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో దర్శకుడిని కూడా మెచ్చుకోవాలంటున్నారు. టిల్లు స్క్వేర్ తర్వాత రాబోతున్న టిల్లు క్యూబ్ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+