"ఉంటామో.. పోతామో" అంటూ సిద్దు జొన్నలగడ్డ షాకింగ్ ట్వీట్ ??
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సైడ్ క్యారెక్టర్ లతో సినిమా కెరీర్ ప్రారంభించిన సిద్దు.. హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నారు. 'డీజే టిల్లు' తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని డీజే టిల్లు 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం జాక్. ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తెలుసు కదా". ఈ చిత్రాన్ని కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సిద్దు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సిద్దు చేసిన పోస్ట్ అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. అప్పటి వరకు ఉంటామో.. పోతామో అర్ధం కావట్లేదు అంటూ ట్వీట్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

"ఓజీ " ట్రెండ్..
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఓజీ ". ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఓజీ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ మూవీలో పవన్ హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'OG' చిత్రంపై ఉన్న క్యూరియాసిటీని ట్విట్టర్ వేదికగా బయటపెట్టారు సిద్. ఈ మేరకు ఆ పోస్టులో.. ఈ హైప్ వల్ల తన ఆరోగ్యం పాడైపోతుందని రాసుకొచ్చారు. 25వ తేదీ వరకు మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, 25వ తేదీ తర్వాత పరిస్థితి ఏంటో" అని.. "పవన్ కళ్యాణ్ గారు, యే పవన్ నహీ, ఆంధీ హై అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది.
#OG HYPE ki health upset ayye la undi . 25th varaku memu untamo pothamo ardham kaatledu. Ippude Ila unte 25th taravaata ento paristhithi. @PawanKalyan garu , YEH PAWAN NAHI , AANDHI HAI . @Sujeethsign this is UNREAL man!!! @priyankaamohan @emraanhashmi sir @MusicThaman bro ,… pic.twitter.com/bzVXOmfXUs
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) September 20, 2025
ఇక ఓజీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకొంది. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే కానీ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోల్లోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయ్యినా, ఫ్లాప్ అయినా అభిమానుల ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఇప్పుడు సిద్దు ట్వీట్ తో ఈ విషయం మరోసారి రుజువు అయ్యిందని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications