సిల్క్ స్మిత చనిపోయే ముందు ఫోన్ చేసిందంటున్న స్టార్ హీరో..

మత్కెక్కించే కళ్లతో ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌ నటి సిల్క్ స్మిత. అప్పట్లో ఆమె సినీ ప్రియుల ఆరాధ్య దేవత అంటే అతిశయోక్తి కాదు. సిల్క్ స్మిత సినిమాలో ఉందంటే మాస్‌ ఆడియెన్స్ కి పండగే అని చెప్పాలి. అప్పట్లో ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం ఎదురుచూసేవారంటే సిల్క్ స్మిత క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ లో సౌత్‌ సినిమాని దశాబ్దన్నర పాటు శాసించింది సిల్క్ స్మిత.

మలయాళ మూవీ ఒట్టపట్టేవార్‌మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సిల్క్ స్మిత. మొదటి ఏడాదే ఆమెకి బ్యాక్‌ టూ బ్యాక్‌ ఏడు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక్క తమిళ సినిమా, ఆరు మలయాళ చిత్రాల్లో నటించి అలరించింది సిల్క్. ఆ తర్వాత తెలుగులో భారతీరాజా దర్శకత్వంలో సీతకోక చిలుక మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దాదాపుగా 16 ఏళ్ల పాటు నటిగా రాణించి .. 360కిపైగా సినిమాల్లో నటించారు సిల్క్ స్మిత.

Silk Smitha called me before her death kannada star hero

సినీరంగుల ప్రపంచంలో యువరాణిలా వెలిగిన ఆమె.. నిజ జీవితంలో మాత్రం ప్రేమ అనే మోసానికి బలైంది. ఎంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకుందో.. అంతే త్వరగా పడిపోయింది. ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం.. ఇండస్ట్రీలో తీరని లోటు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సిల్క్ స్మిత. ఆమె మరణం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని అంటుంటారు. అయితే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ స్టార్ హీరోకు కాల్ చేసిందని స్వయాన ఆయనే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆయనే కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్. 1992లో ఆయన హీరోగా నటించిన హల్లి మేస్త్రు అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఆ చిత్రంలో సిల్క్ స్మిత కూడా నటించారని.. అప్పటి నుంచి ఆమె చనిపోయే ముందు వరకు వారి మధ్య స్నేహం కొనసాగిందని తెలిపారు. ఒకరి పట్ల మరొకరం గౌరవంగా నడుచుకునే వారిమని చెప్పారు. సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసిందని.. ఓ సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేకపోయానని తెలిపారు. ఆ రోజు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేదో రెగ్యులర్ కాల్ అనుకొని మళ్లీ రిటన్ కాల్ చేయలేదని చెప్పారు. కాల్ లిఫ్ట్ చేయనందుకు ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీ అవుతానన్నారు. స్మిత చనిపోవడం తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అన్నారు. ఇక సిల్క్ స్మిత సినిమా కెరీర్ లో హీరోయిన్‌ గాను, బోల్డ్ రోల్స్, వేశ్య పాత్రల లోనూ నటించారు.చివరగా తాను నమ్మినవాళ్లే తనని మోసం చేశారని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+