పదేళ్ల తర్వాత మళ్లీ ఆ జంట కలవబోతోందా? వైరల్‌గా మారిన హాట్ న్యూస్!
తమిళ స్టార్ హీరో శింబు సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అయితే ఆయన నటించబోయే కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు సమాచారం. డ్యూడ్ సినిమా దర్శకుడు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో శింబు ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులోనే నయనతారను కథానాయికగా తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఈ కాంబో కుదిరితే దాదాపు పదేళ్ల విరామం తర్వాత శింబు, నయనతార మళ్లీ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. వీరిద్దరూ చివరిగా 2016లో వచ్చిన 'ఇదు నమ్మ ఆలు'(తెలుగులో 'సరస్వతుడు') సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుందనే వార్త కోలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో శింబు శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

డైరెక్టర్ కీర్తీశ్వరన్‌కు ఇది రెండో సినిమా కావడం విశేషం. తన రెండో ప్రయత్నంలోనే శింబు వంటి పెద్ద హీరోను లైన్‌లో పెట్టడం ఒకెత్తయితే నయనతారను భాగస్వామిగా చేస్తే ఈ ప్రాజెక్టు స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి నయనతార ఎంపికపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ కేవలం ఈ వార్త బయటకు రావడంతోనే సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ రాకముందే ఈ కాంబినేషన్ వార్తలతోనే సినిమా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.














Click it and Unblock the Notifications
