తెలుగు స్టార్ హీరోకు భార్య కావాల్సిన సిమ్రాన్?
ఒకప్పుడు తెలుగులో, తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్ హీరోయిన్ గా ఉండేది. తెలుగులోనైనా, తమిళంలోనైనా ఆమెతో సినిమాలు చేయడానికి అందరు స్టార్ హీరోలు ఎదురుచూసేవారు. అంతటిస్థాయిలో నిలిచింది. ప్రస్తుత తరంలో ఆమెగురించి తెలిసినవారు తక్కువగా ఉంటారు. సినీ పరిశ్రమల్లో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది.
అగ్ర హీరోలు సైతం సిమ్రాన్ కాల్షీట్ల కోసం ఎదురుచూసేవారంటే ఈ బ్యూటీ హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్ గా ముందుకు వెళుతున్న సమయంలోనే తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది. ఆ హీరో కూడా ఆమెతో ప్రేమలో మునిగితేలాడంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సదరు హీరో తండ్రి మాత్రం ఆ పెళ్లికి నిరాకరించాడు. పరిశ్రమలో ఉండే హీరోయిన్లను నమ్మకూడదని, వారిని వివాహం చేసుకుంటే కుటుంబంలో గొడవలు వస్తాయని, తర్వాత విడాకులిచ్చేసి వెళ్లిపోతారని కొడుక్కి చెప్పి అతని మైండ్ సెట్ మార్చేశాడంటారు.

ఆ హీరోకు మొదటి నుంచి తండ్రి అంటే విపరీతమైన అభిమానంతోపాటు భక్తి. దీంతో తండ్రి చెప్పిన మాటలు విని ప్రేమను వదులుకున్నాడు. అతనిమీద కోపంతో సిమ్రాన్ పరిశ్రమకు దూరమైందంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ సిమ్రాన్ పరిశ్రమను వదిలిపెట్టకుండా ఉండివుంటే ఇప్పటికీ సీనియర్ పాత్రలు పోషిస్తుండేదని, అగ్ర హీరోలకు కథానాయికల కొరత ఉండదని, సిమ్రాన్ వల్ల ఆ కొరత తీరేదంటున్నారు. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోవాల్సిన, తెలుగింటి కోడలు కావాల్సిన సిమ్రాన్ పరిశ్రమకు దూరమవ్వాల్సి రావడంపై అభిమానులు బాధపడుతుంటారు.












Click it and Unblock the Notifications