మా నాన్న నన్ను రేప్ చేయలేదు..
"చిన్మయిశ్రీపాద".. గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హీరోయిన్ సమంత, లావణ్య త్రిపాఠి సహా పలువురు హీరోయిన్స్ ఆమె డబ్బింగ్‌తోనే ఆడియన్స్‌కి మరింత చేరువయ్యారు. అంతే కాకుండా ఆమె నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్ర భార్య అని అందరికీ తెలిసిందే. కాగా సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
కాగా రీసెంట్ గానే రాహుల్ దర్శకత్వంలో రష్మిక నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ రిలీజ్ టైంలో చిన్మయి.. ఆమె భర్త రాహుల్ గట్టిగా ట్రోలింగ్ కి గురయ్యారు. మంగళ సూత్రంపై రాహుల్ మాట్లాడిన వీడియోపై దారుణమైన కామెంట్లు చేశారు. తన భర్త వ్యాఖ్యలకు చిన్మయి సపోర్టుగా రావడంతో.. ఆమెపై కూడా తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్మయి లాంటి వారికి పిల్లలు పుట్టకూడదని, పుట్టినా వెంటనే చనిపోవాలని కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. అలానే నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ విషయంలో కూడా స్పందించి చిన్మయి హాట్ టాపిక్ అయ్యారు.

ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి తనపై వచ్చిన దారుణమైన కామెంట్ కి.. తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న తరుణంలో కొద్ది కొందరు నెటిజన్లు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికలపై లైంగిక వేధింపుల గురించి ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో వైరల్ అవుతుంది. ఈ అంశంపై సింగర్ చిన్మయి కూడా రియాక్ట్ అయింది.
ఆ పోస్టులో.. భారత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చోట ఎప్‌స్టీన్‌లు ఉంటారు. ఈ విషయంలో గుడ్డిగా మత పెద్దలను కూడా నమ్మకండి. వారితో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారని గుర్తుంచుకోండి. నేను చెబుతుంది మీరు నమ్మకపోతే.. మీకు తెలిసిన అమ్మాయిని అడగండి. మొదటిసారి ఎప్పుడు, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురి అయిందో చెబుతుంది.' అని పోస్ట్ చేసింది.
No - Akula Reddy.
— Chinmayi Sripaada (@Chinmayi) February 20, 2026
I wasn’t raped by my father.
But you definitely fantasise daughters getting raped by their fathers. And use that so commonly to a woman on Twitter
Shows what you are, your culture,
Your people, your society is and DEFINITELY SHOWS WHO RAISED YOU. pic.twitter.com/lBIr6agCdB
ఇందుకు ఒక నెటిజన్ 'మీ తండ్రి నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని నీచమైన కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే అతనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ఆ ట్వీట్ లో.. 'నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ, కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఖచ్చితంగా ఊహించుకుంటారని తెలుస్తోంది. మీరు ఏమిటో, మీ సంస్కృతి ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని ఎవరు పెంచారో కూడా ఈ ప్రవర్తనలోనే కనపడుతుంది.' అని ఆమె రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications