త్రిష డబ్బు కోసం ఆ పని చేసిందా..? బయటపెట్టిన ప్రముఖ సింగర్

హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.

అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే త్రిష ట్విట్టర్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని త్రిషనే స్వయంగా బయటపెట్టారు.

Singer comments on Trisha Twitter account hack go viral

త్రిష ట్విట్టర్ పేజీలో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ప్రత్యక్షం అయ్యాయి. దీని తర్వాత, కొన్ని ప్రమోషనల్ పోస్టులు విడుదలైన తర్వాత, నటి త్రిష తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని ప్రకటించింది. దీనిని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అయితే ట్విట్టర్‌ హ్యాక్‌పై అమెరికన్ గాయని కాన్యే వెస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాన్వే వెస్ట్ మాట్లాడుతూ..సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంబంధం లేని ఉత్పత్తులను ప్రమోట్ చేసి, ఆపై వారి ఖాతాలు హ్యాక్ అయ్యాయని చెబుతుంటారని, అలా చేసినందుకు వారికి భారీ డబ్బులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో త్రిషను ఉద్దేశించే కాన్వే వెస్ట్ కామెంట్స్ చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. అయితే ఇటీవల త్రిష, ఇళయ దళపతి విజయ్‌లకు సంబంధించి ఓ రూమర్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ , త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+