జూదం ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న స్టార్
స్టార్ సింగర్ గా గీత మాధురి కి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంత మంచి పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు ఆలపించి తనకంటూ ఓ గుర్తింపును పొందారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 2 లో నిలిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏదోవిధంగా ఆమె ట్రెండ్ అవుతూనే ఉంటారు.
తన భర్త నందుతో త్వరలోనే విడాకులు తీసుకోబోతోందంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన గీతా మాధురి అటువంటి ఆలోచనే లేదని, ఆ వార్త అవాస్తవమని, చెత్తవార్తలను నమ్మొద్దంటూ కొట్టేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గీతామాధురి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ప్రతి మనిషి ఎదో ఒక విషయం లో పూర్తిగా అడిక్ట్ అవుతారని, అలాగే తాను కూడా జూదానికి అడిక్ట్ అయినట్లు తేలింది. ఈ విషయం స్వయంగా ఆమే చెప్పుకొచ్చింది. తనకు కేసినో గేమ్స్ ఆడడం చాలా ఇష్టం, ఒక్కసారి ఆట మొదలుపెడితే ప్రపంచాన్నే మర్చిపోతానని, అలా ఆస్ట్రేలియా లో కేసినో ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నట్లు వెల్లడించింది. .

మూడు లక్షల రూపాయిలు పోగొట్టుకున్నారంటకదా అని యాంకర్ గీతామాధురిని ప్రశ్నించగా ఆ విషయాల గురించి ఇప్పుడెందుకు లేండి.. మూడు లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్ అని, అంతకుమించి ఎక్కువే తాను ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిపింది. కేసినో ఆడాలని తనకు ఇప్పటికీ కోరిక ఉందని, కానీ అమ్మకోసం అలాంటివి ఆడకూడదు అని నిర్ణయం తీసుకున్నానని, తనపై తాను ఒట్టు పెట్టుకున్నానని చెప్పింది. జూదం ఆడానంటూ గీతామాధురి ప్రస్తుతం చెప్పిన మాటలు సినీ పరిశ్రమతోపాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications