స్టార్ హీరో ప్రియురాలు ప్రెగ్నెంట్..? భార్య ఉండగానే

ఇటీవలే తమిళ స్టార్ హీరో జయం రవి సైతం తన భార్య ఆర్తికు విడాకులిచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు. విడాకులపై తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. భరణం విషయంలో జయం రవి భార్య ఆర్తి మరోసారి కోర్టు మెట్లు ఎక్కింది. విడాకుల కేసులో భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు విచారణను జూన్‌ 12కి వాయిదా వేసింది. అలాగే వీరిద్దరికి కూడా కోర్టు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని ఆదేశించింది. దీంతో ఆర్తి తన మాజీ భర్తపై పెట్టిన పోస్టులన్నీ తొలగించింది. ఈ విషయాన్ని ఆర్తి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Singer Kenishaa Francis is rumored to be pregnant

మరోవైపు భార్య ఆర్తితో విడాకుల తర్వాత జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు. జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అసలు ఆమెకు, జయం రవికి ఎలా పరిచయం ఏర్పడిందనేది చూస్తే, కేనిషా ఫ్రాన్సిస్‌ సింగర్‌. ఇండిపెండెంట్‌ ఆల్బమ్స్ పాడి పాపులర్‌ అయ్యింది.

బెంగుళూరుకి చెందిన కేనిషా గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతుంటుంది. తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బమ్‌లోనూ ఆమె పాటలు పాడింది. అడపాదడపా సినిమాల్లో పాడటంతోపాటు సోలో ఆల్బమ్స్‌తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.జయం రవి తన సినిమాల షూటింగ్‌లు లేని టైమ్‌లో కాలేజ్‌ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్తుండేవాడు. అక్కడ పబ్‌కి వెళ్లినప్పుడు కేనిషా పరిచయం అయ్యిందట.

ఈ పరిచయం ప్రేమగా మారడంతోనే జయం రవి తన భార్యకు విడాకులిచ్చారని తెలుస్తోంది.సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని, అంతేకాకుండా ప్రెగ్నెంట్ అని నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతున్న వార్తలపై నటి కెనిషా (Kenisha) తాజాగా ఘాటుగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ పుకార్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది.నేను గర్భవతిని అని కామెంట్ బాక్స్‌లో కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు. గర్భిణీ బొడ్డు ఇలాగే ఉంటుందా? నేను గర్భవతిని కాదు.. నాకు అందమైన సిక్స్ ప్యాక్ మాత్రమే ఉందని కెనిషా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను సృష్టించేవారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+