Rahul Sipligunj: ఫుడ్ డెలివరీ బాయ్‍కి రూ.లక్ష సాయం చేసిన సింగర్..
రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలవడంతో మరింత పాపులర్ అయ్యారు. తాజాగా రాహుల్ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఓ వ్యక్తికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. డెలివరీ బాయ్ గా చేస్తూ సంగీతం నేర్చుకుంటున్న వెంకటేష్ కు రాహుల్ సాయమందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ ఎంటైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమవుతున్న సంగీత కార్యక్రంలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ తో పాటు అనంత్ శ్రీరామ్, శ్వేతా మోహన్, మంగ్లీలు కూడా జడ్జీలుగా ఉన్నారు. ఈ షోకు వెంకటేశ్ కంటెస్టెంట్ గా వచ్చాడు. నాని సినిమా కృష్ణార్జున యుద్ధం సినిమాలోని దారి జూడు దమ్ము జూడు మామ అనే పాటను పాడి జడ్జీలను మెప్పించాడు. ఆ తర్వాత వెంకటేష్ పరిస్థితి గురించి ఓ వీడియో ప్లే చేశారు.

వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ సంగీతం నేర్చుకంటున్నట్లు చెప్పాడు. ఈ వీడియో చూసిన రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. తాను కూడా బార్బర్ గా పని చేస్తూ సంగీతం నేర్చుకున్నట్లు చెప్పాడు. నిన్ను చూస్తే తనకు తాను గుర్తొచ్చినట్లు చెప్పారు. కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. వెంకటేష్ సంగీతం నేరుచకోవడానికి లక్ష రూపాయలు సాయంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన రాహుల్ ఫ్యాన్స్ పిధా అయిపోతున్నారు. రాహుల్ అన్న నువ్వు గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications