తగ్గేదే లే.. మళ్లీ ముద్దులతో రెచ్చిపోయిన ఉదిత్ నారాయణ

ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్‌ నారాయణ్‌ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. బాలయ్య సమరసింహారెడ్డి మూవీలో 'అందాల ఆడబొమ్మ', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాలో అమ్మాయే సన్నగా.. విక్టరీ వెంకటేశ్ కలిసుందాం రా చిత్రంలో 'పసిఫిక్‌లో దూకేయమంటే' సహా పలు సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే రీసెంట్ గా తన పాటలతో కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

ఉదిత్‌ నారాయణ్‌ ఇటీవల ముద్దుల వివాదంలో చిక్కుకున్నారు. లైవ్ కాన్సర్ట్‌ లో తనతో సెల్ఫీలు తీసుకోడానికి వచ్చిన లేడీ ఫ్యాన్స్ ను ముద్దు పెట్టుకోవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆయనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

singer Udit Narayan again kissing another lady fan in live consert

ఆ వీడియోలో ఉదిత్ స్టేజ్ మీద పాట పాడుతూ ఉండగా.. కొందరు మహిళా అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడానికి వచ్చారు. అయితే వారితో సెల్ఫీలు దిగే క్రమంలో ఉదిత్‌ ఓ మహిళాభిమాని బుగ్గలపై ముద్దు పెట్టారు. అంతే కాకుండా పక్కనే ఉన్న మరో మహిళా అభిమానిని సైతం కిస్ చేశారు. దీంతో మరోసారి నెటిజన్లు ఉదిత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇది పాత వీడియోనా? లేదా కొత్త వీడియోనా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

సోషల్ మీడియా వేదికగా ఆయన తీరును తప్పు పట్టారు. దీనిపై స్టార్ సింగర్ ఇప్పటికే స్పందించారు. అభిమానులతో ఆ విధంగా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటం లేదని అన్నారు. అయితే ఇప్పుడు ఉదిత్‌ కు సంబంధించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇక ఇప్పటికే ముద్దుల మ్యాటర్ గురించి ఓపెన్ అయిన ఉదిత్‌ నారాయణ్‌.. అభిమానిని ముద్దుపెట్టుకున్నందుకు బాధ పడడం లేదని వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్ పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేసేందుకు అలా చేశానని సమర్థించుకున్నారు. అయితే గతంలోనూ ఈ స్టార్ సింగర్ ముద్దుల వ్యవహారంతో విమర్శల పాలయినట్టు తెలుస్తోంది.

శ్రేయా ఘోషల్, అల్కా యాగ్నిక్ లను ఆయన వేదిక మీదనే ముద్దు పెట్టుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. నాడు సింగర్స్ అయిపోయి ఇప్పుడు అభిమనులపై స్టార్ సింగర్ ప్రేమను చూపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ సమయంలోనే ఆయన పాత ముద్దుల వీడియోలు సైతం నెటిజన్లు రీ పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరి ఉదిత్ తగ్గేదే లేదంటూ ఈ ముద్దుల మ్యాటర్ ని కంటిన్యూ చేస్తారా .. లేక పుల్ స్టాప్ పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+