పేరుకే చిన్న సినిమా..ఇంత బాగుందేంటి..!
ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలకంటే... చిన్న బడ్జెట్ చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుంటున్నాయి. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తాజాగా అలాంటి సినిమానే ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషికి అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి. ముఖ్యంగా ఒంటరితనం అనేది మనిషిని ఎంతలా కుంగదీస్తుందో, ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో హృద్యంగా ఆవిష్కరించిన చిత్రం "స్కై" . వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఫిబ్రవరి 13న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ అనుభూతిని అందిస్తోంది.
కథ
ఈ సినిమా కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది.ప్రభు (ఆనంద్) సింగర్‌గా సక్సెస్ అవ్వాలనే ఆశయంతో కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తాడు. దీనివల్ల భార్యను, హాస్టల్‌లో ఉన్న కొడుకును కోల్పోయి తీరని వేదనతో ఒంటరివాడవుతాడు. ప్రస్తుతం లైవ్ సింగర్‌గా జీవిస్తూ తన బాధను పాటల్లో వెతుక్కుంటుంటాడు.విక్కీ తన కాళ్ల మీద తాను నిలబడుతూ, స్నేహితుడు జాఫర్‌తో కలిసి రెస్టారెంట్ నడుపుతుంటాడు. చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరగడం వల్ల ఇతనిలో ఒక రకమైన భావోద్వేగ సంఘర్షణ ఉంటుంది. వీణ శృతి శెట్టి విక్కీ నిజాయితీకి ముగ్ధురాలై అతనితో ప్రేమలో పడుతుంది. అయితే, తన గతం కారణంగా విక్కీ ఆమె ప్రేమని అంగీకరించలేకపోతాడు. విక్కీ గతం ఏమిటి? ప్రభు దుఃఖానికి చివరికి ఎవరి వల్ల ఉపశమనం లభించింది? వీరి జీవితాలు ఎలా సుఖాంతమయ్యాయి అనేదే ఈ సినిమా.

విశ్లేషణ
కొత్త దర్శకుడు పృధ్వీ పేరిచెర్ల మొదటి సినిమాతోనే ప్రతిభను చాటుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు ఏడు పాటలకు ఆయనే సాహిత్యం అందించడం విశేషం.ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, కామెడీతో వినోదాత్మకంగా సాగుతూ, ఇంటర్వెల్ సీన్‌తో కథలో వేగాన్ని పెంచారు. ఈ సినిమాకు ద్వితీయార్థమే అసలైన ప్రాణం. పాత్రల బ్యాక్ స్టోరీని డెటెయిల్డ్‌గా చూపిస్తూ, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నటీనటుల ప్రతిభ
హీరోగా మురళీ కృష్ణంరాజు పరిచయమైన తొలి చిత్రంలోనే కామెడీ, రొమాన్స్ మరియు ఎమోషనల్ సీన్లలో మంచి ఈజ్ కనబరిచారు. ఆనంద్ చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో ప్రభుగా అద్భుతమైన నటనను ప్రదర్శించి, పాత్రలో జీవించారు. వీణ పాత్రలో శృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ ఒకే సీన్‌లో ఉన్నా మెప్పించారు.
సాంకేతిక విభాగం
సీనియర్ కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్ సిటీ ఏరియల్ షాట్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. శివప్రసాద్ అందించిన మెలోడీ పాటలు హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా "తపనే తెలుపగ" సాంగ్ విజువల్స్ బాగున్నాయి. సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ కథకు బలాన్ని చేకూర్చింది.
ముగింపు
ఓవరాల్‌గా "స్కై" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. జీవితం నేర్పే పాఠాలను, ఒంటరితనంలోని భావోద్వేగాలను చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక.
రేటింగ్ : 2.5/5
-
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా?












Click it and Unblock the Notifications