పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ మామ షాకింగ్ కామెంట్స్

మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

Sneha Reddy father Chandrasekhar Reddy on Pawan Kalyan

దీంతో మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో మెగా , అల్లు వివాదం మరింత ముదిరినట్టు అయింది. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి స్పందించారు.

స్నేహారెడ్డి తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప చిత్రంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఆయన ఖండించారు. అల్లు అర్జున్ ఒక నటుడిగా పుష్ప చిత్రంలో నటించాడు. అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయలేదు కదా. అల్లు అర్జున్‌ నిజంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యాపారం చేస్తే అది తప్పు. ఒక సినిమాలో నటుడిగా నటిస్తే తప్పేముంది. దయచేసి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలని పెద్ద మనసుతో వెనక్కి తీసుకోవాలి. లేదా తాను చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి కాదు అని చెప్పాలి. పుష్ప చిత్రాన్ని అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంలోకి నెమ్మదిగా కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అయినట్టే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+