పెళ్లైన పది రోజులకే షాకిచ్చిన శోభిత ధూళిపాళ
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు. వీరిద్దరి కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు.
ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.

యూనిక్ ఔట్ ఫిట్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడ్రన్ డ్రెస్‌లో కనిపించి ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్సులో ఎప్పటిలాగే క్లీవేజ్‌తో కనిపించిది.గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్.శోభిత గ్లామర్ డోస్‌పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లైన పది రోజులకే రచ్చ లేపిదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.












Click it and Unblock the Notifications