ఐటెం సాంగ్‌లో నాగ చైతన్య కాబోయే భార్య..హీరో ఎవరో తెలుసా..?
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయింది.ఈ వార్తలను నిజం చేస్తూ..నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆమె బాలీవుడ్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. బాలీవుడ్‌లో ''డాన్'' సిరీస్‌కు ఎనలేని క్రేజ్ ఉంది. మొదటి రెండు పార్ట్‌ల్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించగా, మూడో పార్ట్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం శోభిత ధూళిపాళను చిత్ర యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈ ఐటం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఐటెం సాంగ్ చేస్తే... అది అక్కినేని ఫ్యామిలీకి భారీ షాక్ అనడంలో సందేహం లేదు. గతంలో ఐటం సాంగ్ కారణంగానే సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో శోభిత ఐటం సాంగ్‌లో నటిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. మరి ఐటం సాంగ్ విషయంలో శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..












Click it and Unblock the Notifications