ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న అక్కినేని కాబోయే కోడలు
అక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు నాగ చైతన్య. శోభిత ధూళిపాళను సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చాడు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం తర్వాత శోభిత ధూళిపాళ సైలెంట్ అయింది. నాగ చైతన్యతో కూడా పెద్దగా బయట కనిపించలేదు. ఇదే సమయంలో సమంత, నాగ చైతన్యల విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నేతలతో పాటు, ఇటు సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఖండించింది. అయితే ఈ వ్యాఖ్యలపై శోభిత ధూళిపాళ మాత్రం రియాక్ట్ కాలేదు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత ధూళిపాళ, మరోసారి తనదైన ఫోజులతో అదరగొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.మెరిసిపోతున్న లెహంగా ధరించి.. నడుము అందాలు ప్రదర్శిస్తోన్న ఈ బ్యూటీ 'ఫైర్ ఇన్ ద బజార్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. విచిత్రంగా తన మేకప్ ఆర్టిస్టులను కూడా తన ఫొటోలకు జత చేసింది. శోభితను రెడీ చేస్తున్నట్లు, తను చెవులకు దుద్దులు పెట్టుకుంటున్నట్లు, మిర్రర్ ఫొటోలు.. ఇలా ప్రతి ఒక్క స్టిల్‌లో శోభిత తనదైన రేంజ్‌లో ఫోజులిచ్చింది.
ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక శోభిత ధూళిపాళ కెరీర్ విషయానికి వస్తే..రామన్ రాఘవవ్ 2. 0 హిందీ చిత్రంతో నటిగా శోభిత నటిగా పరిచియం అయింది. తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్: 1,పొన్నియన్ సెల్వన్: 2 సినిమాల్లో కనిపించి సందడి చేసింది. సితార, కురుప్, మంకీ మ్యాన్ వంటి సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల వద్ద మంచి పేరు దక్కించుకుంది.ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications