శోభిత ధూళిపాళకు ఆ పిచ్చి ఉందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.

ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శోభితకు ఓ పిచ్చి ఉందట. ఆమె ఏ కాస్తా టైమ్ దొరికినా ట్రావెల్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారట. షూటింగ్‌లకు గ్యాప్ దొరికితే చాలు టూర్లు ప్లాన్ చేస్తుంటారట శోభిత. అలాగే ఫొటోగ్రఫీ కూడా అంటే ఇష్టమని తెలుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్లినా , తనతో పాటు కెమెరాను తీసుకెళ్తుంటారట. ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఆమెకు ఫొటోగ్రఫీ స్పెషల్ టాలెంట్ ఉందట.
అందుకే ఆమె కెమెరాను ఎప్పుడూ తనతోనే వెంటపెట్టుకుంటారట. దీనిలో భాగంగానే శోభిత తన సోషల్ మీడియాలో తాజాగా టాలెంట్‌ను బయటపెడుతూ.. కెమెరాతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే శోభితలో ఈ స్పెషల్ టాలెంట్ చూసిన నెటిజన్లు .. ఆమెతో కష్టమే అని, షూటింగ్ గ్యాప్ దొరికితే టూర్లకు ప్లాన్ చేస్తే..నాగ చైతన్య జేబు ఖాళీ అవ్వడం ఖాయమంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యకు భలే కష్టం వచ్చి పడిందే అంటూ మరి కొందరు
ఇక శోభిత ధూళిపాళ కెరీర్ విషయానికి వస్తే..తెలుగులో 'గూఢచారి 2',తమిళంలో 'వెట్టువన్', సినిమాలతో పాటు, మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే వెబ్ సిరీస్‌ల్లో అమ్మడు నటిస్తోంది.












Click it and Unblock the Notifications