సమంత చేసిన ఆ ఒక్క పని నేను చేయను: శోభిత ధూళిపాళ
తెలుగు సినీ ప్రపంచంలోని అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని కుటుంబంలోకి త్వరలోనే కోడలుగా అడుగు పెట్టబోతోంది శోభిత ధూళిపాళ. తెనాలికి చెందిన ఈ అమ్మాయితో ప్రేమలోపడ్డ నాగచైతన్య నిర్ణయాన్ని గౌరవించిన నాగార్జున కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 8వ తేదీన ఇద్దరికీ నిశ్చితార్థం జరిపించారు. వివాహం రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో లేదంటే పారిస్ లో చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో పెళ్లి జరగబోతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం శోభిత బిజీగా ఉంది.
ఆ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురాను
తాజాగా ఆమెకు రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న డాన్-3 చిత్రంలో ఐటం సాంగ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సినిమాలో ఇతరత్రా ఏమైనా పాత్రలు ఉంటే నటిస్తానని, ఐటం సాంగ్ మాత్రం చేయనని స్పష్టం చేసింది. తనకు పెళ్లి కుదిరిందని, తన కాబోయే భర్త నాగచైతన్య అనుమతి లేకుండా, ఆయనకు ఇష్టం లేకుండా ఏ పని చేయనని చెప్పిందని సమాచారం. అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతున్నప్పుడు కెరీర్ పరంగా తనకు ఇబ్బంది రాకుండా, ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమని సన్నిహితులతో శోభిత చెప్పింది.

అందుకే జాగ్రత్తలు తీసుకుంటోంది
నాగచైతన్య మొదటి భార్య సమంత పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా.. ఊహూ అంటావా మావా అనే ప్రత్యేక గీతంలో నర్తించింది. దీనిపై సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నాగచైతన్యకు ఇష్టం లేకపోయినప్పటికీ కావాలనే నటించిందని, అప్పటినుంచే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అందుకే శోభిత ధూళిపాళ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పెద్ద కుటుంబంలోకి కోడలిగా వెళుతున్నప్పుడు వారి అభిప్రాయాలను, ఆచారాలను గౌరవించి అందుకు అనుగుణంగా నడుచుకోవడం కోడలిగా ఆమె బాధ్యత అని, ఆ బాధ్యతను శోభిత సక్రమంగా నెరవేరుస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications