సమంత నాగ చైతన్యను వదిలేలా లేదుగా..!
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సమంత వైపు మళ్లింది. సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. గురువారం అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి , ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. శోభిత ధూళిపాళకు ఓ చెల్లెలు ఉంది. శోభిత ధూళిపాళ్ల చెల్లి పేరు కూడా సమంతనే కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇది చూసిన అక్కినేని అభిమానులు చైతూకి ఎక్కడికి వెళ్లిన సమంత పేరు మాత్రం తప్పట్లే అని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతున్నారు. నాగ చైతన్యను ఎక్కడికి వెళ్లిన సమంత అనే పేరు అతడిని పట్టుకునే ఉంటుంది ఏమో అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మాజీ భార్య రూపంలో ఆ పేరు దూరం అయిన మరదలి రూపంలో చైతూ లైఫ్‌లోకి మళ్లీ ఆ పేరు వచ్చిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మీ పేరు సమంత, మీ బావ మాజీ భార్య పేరు సమంత పాపం చైతన్య అంటూ మరొకతను కామెంట్ పెట్టాడు.
ఇక నాగ చైతన్య మరదలు సమంత ధూళిపాళ్ల విషయానికి వస్తే.. వృత్తిరీత్యా డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ విభాగంలో ఎండీగా పని చేస్తోంది. అయితే సమంత ధూళిపాళ తన అక్క కంటే ముందే వివాహం చేసుకుని విదేశాల్లో ఉంటుంది. అక్క నిశ్చితార్థానికి రాలేకపోయిన సమంత, పెళ్లికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications