గెలవాలని కోరుకుంటున్నా... నాగచైతన్యకు సమంత పోస్ట్?
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. తన అందం, నటనతో అందరినీ కట్టిపడేసింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత విడాకులిచ్చేసింది. మయోసైటిస్ రావడంతో చికిత్స తీసుకునేందుకు ఒక ఏడాది సమయం సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం కథలను వింటోంది. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయికానీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.
గెలవాలని కోరుకుంటున్నా
ఏడాది నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నప్పటికీ ఇటీవలే నిర్వహించిన సర్వేలో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలను తెలియజేస్తూ, ఫొటోలను అప్ డేట్ చేస్తుంటుంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ ఒకటి వైరలవుతోంది. అందులో ఏముందంటే నేను మీరు గెలుస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆమె తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'నీ హృదయం ఏది కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా, నేను మీ కోసం నిలబడతాను. మీరు గెలవడానికి అర్హులు' అని రాసుకొచ్చింది.

పాన్ ఇండియా సినిమాగా తండేల్
ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టివుంటుందని నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది. తండేల్ సినిమా కోసం నాగచైతన్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజు అనే మత్స్యకారుడి జీవిత చరిత్రతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు చందు మొండేటి. సాయిపల్లవి కథానాయిక. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని సమంత కోరుకుంటోందని, అందుకే ఈ పోస్టు పెట్టిందని చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలని కోరుకుంటోందంటున్నారు. ఏది నిజమో సమంతే చెప్పాలి.












Click it and Unblock the Notifications