చెప్పేవేమో ఆ కబుర్లు.. చేసేదేమో ఈ పనులా ??? ఆ సెలబ్రిటీలపై నెటిజన్ల ఫైర్ !!

మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో యాంకర్లు, సెలబ్రిటీల ప్రవర్తనపై నెటిజన్లు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు టీవీ స్క్రీన్లపై అలరించిన ప్రముఖులు నిజ జీవితంలో మాత్రం ఆచరించే విధానంతో విమర్శల పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇద్దరు తెలుగు యాంకర్ల వ్యవహారం మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఇద్దరూ యాంకర్లుగా రాణించి సినిమాల్లో సైతం మెప్పించారు. కానీ వీరు ఫాలో అవుతున్న "కొత్త ట్రెండ్", "ద్వంద్వ నీతి"పై యూజర్లు ఘాటుగానే ఫైర్ అవుతున్నారు.

ముందుగా ఇప్పుడు ఒక యంగ్ యాంకర్ గురించి చెప్పుకోవాలి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడేమైనా మనమే తోపు మనమే టాప్ అనేలా సాధించారా అంటే.. చేసిందే 3, 4 షో లు.. అందులోనూ ఆవిడ షో ఎక్కువ ఉందంటూ ఓపెన్ డిస్కషన్ జరిగేది. సరే అక్కడ ఎటూ మనకి ఇక పని లేదనుకొని.. వచ్చిన రియాలిటీ షో ఛాన్స్ ని గట్టిగా ఉపయోగించుకున్నారు. ఆ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారా అంటే కంటెంట్ కోసం ప్రేమ వ్యవహారం నడిపి మధ్యలోనే వచ్చేశారు.

social-media-trollings-on-two-telugu-anchors-and-heavy-discussions-about-early-days-and-present-days

ఇక ఈ మధ్య కాలంలో ఆమె టెలివిజన్ షోల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. మొదటి నుంచి స్కిన్ షో చేస్తూ యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె ఈ మధ్య ఇంకొంచెం డోస్ పెంచింది. ఇటీవల "ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్" ఫీచర్ వచ్చిన విషయం తెలిసిందే. నెలకు ఇంత డబ్బు కడితేనే నా ఎక్స్‌క్లూజివ్ గ్లామర్ ఫోటోలు, వీడియోలు చూపిస్తానంటూ ఓ బిజినెస్ మోడల్‌ను తెచ్చింది. డబ్బుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ గట్టిగానే పోగేస్తున్నారు.

అయితే బోల్డ్ కంటెంట్ పెడుతున్నప్పుడు రకరకాల కామెంట్లు రావడం సహజం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఒకవైపు డబ్బుల కోసం గ్లామర్ షో చేస్తూ, మరోవైపు ఆ ఫోటోలపై ఎవరైనా కాస్త హద్దులు దాటి కామెంట్స్ పెడితే లేదా ట్రోల్ చేస్తే మాత్రం సదరు యాంకర్ కి కోపం వచ్చేస్తోంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, కేసులు పెట్టడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. "డబ్బులు ఇచ్చి నీ గ్లామర్ చూడాలి.. కానీ ట్రోల్ చేసిన వారిపై మాత్రం కేసులా అంటూ సెటైర్లు వేస్తున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఆ పనులు అంటూ గట్టిగా తిట్టిపోస్తున్నారు.

ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో సెలబ్రిటీలను, అది కూడా అమ్మాయిని ఇలా కామెంట్స్ చేస్తారా అని మాట్లాడే వారు .. మరి దాచుకోవాల్సిన అవయవాలను అందరికీ చూపించేస్తూ మీరేం సాధించారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఓ పక్క స్మార్ట్ ఫోన్ కాలం కావడంతో చిన్నారులు, టీనేజ్ వారు సైతం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వారంతా కూడా మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి.. సెలబ్రిటీ స్థాయిలో ఉండి.. ఉన్నదంతా చూపించండి అంటూ సభ్య సమాజానికి ఇంకేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదే తరహా విషయంలో మరో సీనియర్ యాంకర్ రూటే వేరు. ఈమెపై వచ్చే ట్రోల్స్, ఈమె ఇచ్చే కౌంటర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సృష్టిస్తాయి. అయితే నెటిజన్లు ఆమె గతాన్ని గట్టిగానే గుర్తు చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో షోలలో రేటింగ్స్ కోసం, నవ్వుల కోసం తనపై వచ్చే డబుల్ మీనింగ్ జోకులను, బాడీ షేమింగ్ కామెంట్లను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తుంటారు. ఆ రోజుల్లో అవన్నీ స్క్రిప్ట్ లో భాగం అంటూ లైట్ తీసుకున్నారు.

కానీ, ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చాక మాత్రం రూట్ మార్చేశారు. సోషల్ మీడియాలో చిన్న మాట అన్నా తట్టుకోలేకపోవడం, తనేదో పెద్ద 'ఫెమినిస్ట్' లాగా బిల్డప్ ఇవ్వడం, నెటిజన్లపై లీగల్ నోటీసులు, పోలీస్ కేసులు అంటూ హడావుడి చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "నాడు డబుల్ మీనింగ్ జోకులకు నవ్వినప్పుడు లేని ఫెమినిజం.. నేడు సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్ చేస్తే కోపం వచ్చేస్తుందా?" అంటూ మీమర్స్ గట్టిగానే కడిగిపారేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+